Advertisement

  • నూత‌న రెవెన్యూ చ‌ట్టంతో రైతుల‌కు మేలు జరుగుతుంది: మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

నూత‌న రెవెన్యూ చ‌ట్టంతో రైతుల‌కు మేలు జరుగుతుంది: మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి

By: chandrasekar Fri, 25 Sept 2020 11:50 AM

నూత‌న రెవెన్యూ చ‌ట్టంతో రైతుల‌కు మేలు జరుగుతుంది: మ‌ంత్రి నిరంజ‌న్ రెడ్డి


రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాల‌యంలో రైతు స‌మ‌న్వ‌య స‌మితుల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన
మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన నూత‌న రెవెన్యూ చ‌ట్టంతో రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

భూ స‌మ‌స్య‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ల‌భిస్తుంద‌న్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గానికి సాగు నీరు అందించామ‌ని పేర్కొన్నారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గ రైతులంద‌రూ సంతోషంగా ఉన్నార‌ని అన్నారు.

దేశంలో ఎక్క‌డా లేని విధంగా రైతుల‌కు 24 గంట‌ల ఉచిత క‌రెంట్ ఇస్తున్నామ‌ని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల‌తో అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలుస్తున్నామ‌ని పేర్కొన్నారు.

తెలంగాణ‌లో ఎరువులు, విత్త‌నాల‌కు కొర‌త లేద‌ని, రైతులు నియంత్రిత సాగు చేప‌ట్ట‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌న్నారు. కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్రిక‌ల్చ‌ర్ బిల్లుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంద‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు.

Tags :
|

Advertisement