Advertisement

భారత సైన్యంలో కొత్త సమస్య...

By: chandrasekar Wed, 21 Oct 2020 6:37 PM

భారత సైన్యంలో కొత్త సమస్య...


భారత సైన్యం కొత్త సమస్య మొదలయింది. అంతంత మాత్రంగానే ఉండే జీతాలకు తోడుగా అయినవారికి దూరంగా ఉండటంతో మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సెలవుల కోసం పైఅధికారులపై దాడులు చేసిన పలు సందర్భాలు కూడా ఉన్నాయి. గత నెలలో లెఫ్టినెంట్‌ కల్నల్, కల్నల్ హోదాల్లో ఉన్న ఆరుగురు సైనికాధికారులు గుండెపోటుతో మరణించారు. వీరంతా 40–45 ఏండ్ల మధ్య వయస్సు వారు. భారత సైన్యంలో 'జీవన నాణ్యత' అంత మంచిది కాదని ఈ మరణాలు స్పష్టం చేస్తున్నాయని నిపుణులు వాదిస్తున్నారు. కొన్నిసార్లు ఈ నాణ్యత చాలా తక్కువగా ఉంటుండటంతో సైన్యం ఉద్రిక్తత, ప్రతికూలతకు బలైపోతున్నది. ఒక నివేదిక ప్రకారం, ప్రతి ఏటా భారతదేశం యుద్ధంలో కాకుండా ఇతరత్రా కారణాలతో 1,600 మంది సైనికులను కోల్పోతున్నది. భద్రతా దళాల జీవితాలలో ఎప్పుడూ ఉద్రిక్తత ఉంటున్నది. కానీ ఇంతకు ముందు సమస్య ఇంత పెద్దగా లేదు. సైన్యంపై ప్రతికూల ప్రభావం ఉండదని నిర్ధారించడానికి తగిన భద్రతా యంత్రాంగాలు ఎల్లప్పుడూ ఉన్నాయి. కానీ, ప్రస్తుత పరిస్థితిలో పర్యావరణం మారుతున్నట్లు కనిపిస్తున్నది. 30 నుంచి 40 ఏండ్ల వయసున్న సైనిక అధికారుల ప్రతిచర్యల గురించి బయటకు వచ్చిన నివేదికలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలువడ్డాయి. 87 శాతం మంది పని ఒత్తిడి కారణంగా సెలవు తీసుకోలేకపోతున్నారు. 73 శాతం మంది సెలవు తీసుకున్నప్పటికీ, పని కారణంగా తిరిగి విధులకు హాజరుకావాల్సి వస్తున్నది. 63 శాతం మంది తమ వైవాహిక జీవితం కారణంగా ప్రభావితమైందని నమ్ముతున్నారు. 85 శాతం మంది ఆహారం తినేటప్పుడు కూడా అధికారిక ఫోన్‌ కాల్‌లకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని నివేదించారు.

ప్రతికూల టెక్నాలజీ

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల శారీరక, మానసిక స్థాయిలు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. 40 శాతం మంది అధికారులు వారు 'స్థిరమైన తనిఖీదారులు' అని నమ్ముతారు. 60 శాతం మంది తమ ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లకు ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి వుంటున్నట్లు చెప్పారు. ఒక అధ్యయనం ప్రకారం, 79 శాతం మంది తమకు ఎలాంటి పొరపాటు చేయటానికి అవకాశం లేదని, వారు అన్ని సమయాలలో 'సరైనది' కావాలని, సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది వారి బాధ్యత. ఈ 'జీరో ఎర్రర్ సిండ్రోం' ఒత్తిడిని పెంచుతుంది. పని-జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం అంత సులభం కాదని ఈ పరిశోధన నుంచి తేటతెల్లమైంది. టెక్నాలజీ మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి యువతరానికి భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి.

పరిశోధనలో పాల్గొన్న యువత ఎక్కువసేపు పనిచేయడం అంటే.. వారు ఇంటికి త్వరగా వెళ్ళిన వారికంటే వారి పని పట్ల ఎక్కువ స్పృహ కలిగి ఉంటారని నమ్ముతారు. పరిశోధనలో పాల్గొన్నవారు తమ పని చేయడానికి స్వేచ్ఛ పొందాలని కూడా నమ్ముతున్నారు. కొన్ని పరిశోధనలు ఉద్యోగులను ఆంక్షల్లో ఉంచినట్లయితే, వారి సమస్యలను పరిష్కరించడానికి వారికి మార్గం ఇవ్వకపోతే.. వారు హాని అనుభూతి చెందడమే కాకుండా సృజనాత్మకంగా పని చేయలేకపోతున్నారని తేలింది. ఈ సమస్యలను అధిగమించాలంటే, సాయుధ దళాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. 'తప్పులను అంగీకరించడం లేదు' అనే అలవాటును వారి నుంచి తొలగించడం అవసరం. ఇది చిన్న వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండటానికి అధికారులకు సహాయపడుతుంది. కుటుంబంతో గడుపడం వల్ల మానసికంగా బలవంతులై మరింత ఎక్కువగా పనిచేస్తారని పలు అధ్యయనాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్య సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టిసారించి వారికి మానసిక, శారీరక సమస్యలు రాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నిపుణులు పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement