Advertisement

ఎల్జీ నుండి కొత్త ఫోన్ - LG Q52 లాంచ్

By: chandrasekar Mon, 26 Oct 2020 5:04 PM

ఎల్జీ నుండి కొత్త ఫోన్ -  LG Q52 లాంచ్


కొరియన్ కంపెనీ ఎల్జీ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఎల్జీ కంపెనీ తన కొత్త స్మార్ట్ ఫోన్ ఎల్జీ క్యూ52ని లాంచ్ చేసింది. గతంలో లాంచ్ అయిన ఎల్జీ క్యూ51కు తర్వాత వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 3,30,000 కొరియన్ వాంగ్‌లుగా (సుమారు రూ.21,500) నిర్ణయించారు. సిల్కీ బ్లూ, సిల్కీ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ కొరియాలో అక్టోబర్ 28వ తేదీన జరగనుంది.

ఫోన్ స్పెసిఫికేషన్లు:

* ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ హోల్ పంచ్ డిస్ ప్లేను అందించారు.
* 2.3 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.
* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
* ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు 5 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్‌లు కూడా ఉన్నాయి.
* ముందువైపు 13 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
* బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.

Tags :
|
|
|
|

Advertisement