Advertisement

లాక్ డౌన్ 5.0 లో కొత్త మార్గదర్శకాలు ఇవే

By: Sankar Sat, 30 May 2020 8:10 PM

లాక్ డౌన్ 5.0 లో కొత్త మార్గదర్శకాలు ఇవే

దేశంలో లాక్ డౌన్ 5.౦ జూన్ 1నుంచి జూన్ 30 వరకు అమలులోకి రానుంది ..దీనిలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది ...
1 జూన్ 8 నుంచి అన్ని రాష్ట్రాలలో ప్రార్ధన మందిరాలను తెరుచుకోవచ్చు
2 లాక్ డౌన్ అయిదవ దశలో రాత్రి పూట కర్ఫ్యూ లో మార్పులు చేసింది ..ఇక నుంచి రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు ఉంటుంది
3 కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలు జూన్ 30 వరకూ కొనసాగుతాయి. కంటోన్మెంట్ జోన్ల వెలుపల దశలవారిగా ఆంక్షలు సడలిస్తారు. ఆయా రాష్ట్రాలు తమతమ అంచనాల మేరకు ఆంక్షలు లేదా నిషేధ ఆజ్ఞలు అమలు చేయవచ్చు.
4 వ్యక్తులు, సరకుల అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండవు. ఇందుకు ప్రత్యేక అనుమతి, ఇ-పర్మిట్ల అవసరం లేదు.
5 అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైల్, సినిమా హాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు ఉన్నాయి. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా విషయిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే తేదీలు పరిస్థితుల అంచనాలను బట్టి నిర్ణయిస్తారు.
6 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదించి స్కూల్స్ , కాలేజీలు ఎప్పుడు తెరవాలని దానిపై నిర్ణయిస్తారు



Tags :
|
|
|

Advertisement