Advertisement

యల్ బి నగర్ లో మరొక ఫ్లై ఓవర్ ఓపెన్

By: Sankar Thu, 28 May 2020 5:10 PM

యల్ బి నగర్ లో మరొక ఫ్లై ఓవర్ ఓపెన్

ప్రతిష్టాత్మక వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లోని ఒక్కో ప్రాజెక్టు పూర్తవుతోంది. గ్రేటర్‌లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ చిక్కులులేని రాకపోకల కోసం ప్రతిపాదించిన వంతెనలు, అండర్‌పా్‌సలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. కామినేని జంక్షన్‌ వద్ద కుడివైపు వంతెన, ఎల్‌బీ నగర్‌లోని అండర్‌పా్‌సను గురువారం పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించనున్నారు. ఇటీవలే పశ్చిమ జోన్‌లోని బయో డైవర్సిటీ జంక్షన్‌లోని ఫస్ట్‌ లెవల్‌ వంతెన ప్రారంభోత్సవం జరిగింది. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా ఆరు వంతెనలు, మూడు అండర్‌పా్‌సలు అందుబాటులోకి వచ్చాయి. గురువారం ఈస్ట్‌ జోన్‌లోని మరో వంతెన, అండర్‌ పాస్‌ వినియోగంలోకి రానుంది. మిగతా ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రెండు, మూడు నెలల్లో మరిన్ని వంతెనలు ప్రారంభిస్తామని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎల్‌బీనగర్‌ జోన్‌లోని ప్రారంభోత్సవాలపై బుధవారం కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అభివృద్ధి కొనసాగింపు క్రమంలో రైతుల కోసం సాగునీటి వసతులపై దృష్టిసారించిన ప్రభుత్వం... నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌డీపీలోని మరో రెండు పూర్తయిన ప్రాజెక్టులను నేడు ప్రారంభించుకోబోతున్నామని పేర్కొన్నారు. లుక్‌ ఈస్ట్‌ పాలసీలో భాగంగా నగరానికి తూర్పు వైపున ఉన్న ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలో పంజాగుట్టలోని స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం ఉంటుందని ఇంజనీరింగ్‌ విభాగం అధికారి ఒకకరు తెలిపారు.


Tags :
|

Advertisement