Advertisement

ఏపీలో 26 జిల్లాల ఏర్పాటుకు చర్యలు

By: Dimple Mon, 24 Aug 2020 11:24 AM

ఏపీలో 26 జిల్లాల ఏర్పాటుకు చర్యలు

రాష్ట్రంలో ప్రణాళికాబద్ధంగా కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా అధికారిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 – 26కు పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభజన ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ (ఎస్‌ఎల్‌సీ), వివిధ అంశాలపై అధ్యయనం కోసం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. వీటికి సహకరించేందుకు కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా కమిటీలను నియమించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీ చేశారు.

రాష్ట్ర్రస్థాయి కమిటీ బాధ్యతలు
ఎస్‌ఎల్‌సీ కోసం ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌)లో సచివాలయం ఏర్పాటు కానుంది.
సబ్‌ కమిటీల నుంచి ఎస్‌ఎల్‌సీ సమాచారం õసేకరించి జిల్లా పునర్వ్యవస్థీకరణ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. జీఐఎస్‌ మ్యాపులు లాంటివి సమకూర్చాలి. జిల్లా పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ జరిగిన ప్రాంతాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి డేటా తెప్పించుకోవాలి.
నిపుణులు, ఏజెన్సీలు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవచ్చు. ఎస్‌ఎల్‌సీ సచివాలయం ప్రాథమికంగా ఆరు నెలలు కొనసాగుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారు.

నాలుగు సబ్‌ కమిటీల విధులు
జిల్లాల సరిహద్దులు, న్యాయ పరమైన అంశాల అధ్యయన బాధ్యతలను మొదటి ఉప సంఘం పర్యవేక్షిస్తుంది.
ప్రస్తుత పరిస్థితి/ సిబ్బంది పునర్విభజన అధ్యయన బాధ్యతలను రెండో సబ్‌ కమిటీ నిర్వర్తిస్తుంది.
ఆస్తులు, మౌలిక సదుపాయాల అధ్యయన బాధ్యతలను మూడో సబ్‌ కమిటీ నిర్వహిస్తుంది.
ఐటీ/ సాంకేతిక అంశాల అధ్యయన బాధ్యతలను నాలుగో సబ్‌ కమిటీ చేపడుతుంది.

జిల్లా కమిటీల్లో ఎవరెవరికి ప్రాధాన్యత
కలెక్టరు అధ్యక్షతన పనిచేసే డీఎల్‌సీకి జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ, రైతు భరోసా, రెవెన్యూ) సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఎస్పీ, జిల్లా విద్యా శాఖాధికారి, వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా పరిషత్‌ సీఈవో, ముఖ్య ప్రణాళికాధికారి, ట్రెజరీ ఆఫీసర్, కలెక్టరు ప్రతిపాదించిన అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు/ విభాగాధిపతులు ఎస్‌ఎల్‌సీ సమావేశాలకు హాజరై సమాచారాన్ని సకాలంలో అందించాలని సీఎస్‌ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ధోనీ మామూలోడు కాదు - మైకేల్ హోల్డింగ్‌ ఆశ్చర్యం

newsdistricts,andhrapradesh ,ఏపీలో 26 జిల్లాల ఏర్పాటుకు చర్యలు

మహేంద్ర సింగ్‌ ధోనీ తన చాకచక్యంతో క్రికెట్లో అద్బుతాలు సాధించి.. ఎవరికీ అంతుబట్టని ఆటగాడిగా ఎదిగాడని అభినందనలు వెల్లువెత్తున్నాయి. టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ వీరుడని వెస్టిండీస్‌ దిగ్గజం మైకెల్‌ హోల్డింగ్‌ అన్నారు. మిడిలార్డర్‌లో అతనెప్పుడూ ఆటను నియంత్రించాడే కానీ, విఫలం కాలేదని ప్రశంసించారు. టెస్టుల్లో వికెట్‌ కీపింగ్‌ చేస్తూ దాదాపు 5000 పరుగులు చేయడం సులభమేమీ కాదని పేర్కొన్నారు. యూట్యూబ్ ఛానల్‌ ద్వారా హోల్డింగ్‌ మాట్లాడారు.

ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్ ‌ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్‌ మహీనే. ఆగస్టు 15న ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఓటమి తర్వాత ధోనీ మైదానంలో అడుగు పెట్టని సంగతి తెలిసిందే.

‘జులపాల జుట్టుతో వన్డే క్రికెట్‌ ఆడుతుంటే ధోనీ వీరుడిలా అనిపించాడు. ముందుకొచ్చిన అన్నిటినీ నాశనం చేసేలా కనిపించాడు. నిజానికి అతడదే పనిచేశాడు. వన్డే కెరీర్‌లో 229 సిక్సర్లు బాదేశాడు. ఆ గణాంకాల గురించి ఆలోచిస్తుంటే.. అన్ని సిక్సర్లు బాదాలంటే ధోనీ కనీసం 40 ఏళ్లు ఆడాల్సింది అనిపిస్తుంది. కానీ అతడి స్వభావం అలాంటిది మరి’ అని హోల్డింగ్‌ అన్నారు.
టాప్‌ ఆర్డర్లో మహీ విరుచుకుపడేవాడు. మిడిలార్డర్‌కు వెళ్లాక నియంత్రణ కోల్పోవడం ఎప్పుడూ చూడలేదు. అతనో అద్భుతమైన సారథి. సహనం కోల్పోతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. పరిస్థితులు చేజారుతున్నాయని అనిపిస్తే ఆటగాళ్లను పిలిచి నిగ్రహంతో మాట్లాడేవాడు.

మార్పులు సూచించేవాడు. దాంతో అన్నీ మారిపోయేవి. టెస్టుల్లో అతడు 5000 పరుగులు చేశాడు. వికెట్‌ కీపర్‌గా అన్ని పరుగులు చేయడం అసాధారణం. వన్డేల్లోనూ దాదాపు 11000 పరుగులకు చేరువయ్యాడు’ అని హోల్డింగ్‌ తెలిపారు.

Tags :

Advertisement