Advertisement

దక్షిణాఫ్రికాలో మరొక కొత్త కరోనా వైరస్

By: Sankar Thu, 24 Dec 2020 10:57 AM

దక్షిణాఫ్రికాలో మరొక కొత్త కరోనా వైరస్


దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వైరస్‌ వేరియంట్‌ను గుర్తించారు. దీనివల్లనే అక్కడ కేసుల సంఖ్యతో పాటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని నిర్ధారించారు. ఇది కరోనా సెకండ్‌వేవ్‌ అని పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ రెండో రకం కరోనా వైరస్‌ను తాజాగా యూకేలోనూ గుర్తించారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణమున్న ఈ కరోనా వైరస్‌ను బ్రిటన్‌లో కరోనా బారిన పడిన ఇద్దరిలో గుర్తించామని బ్రిటన్‌ ఆరోగ్య శాఖ మంత్రి మాట్‌ హాన్‌కాక్‌ వెల్లడించారు. వారిద్దరూ ఇటీవల దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను యూకే నిషేధించింది.

ఇప్పటికే యూకే లో కొత్త కరోనా వైరస్ కారణంగా కేసులు నమోదు అయితున్నాయి...దీనితో యూకే లో అనేక ప్రాంతాలలో ఆంక్షలు విధిస్తున్నారు..ఇక యూకే నుంచి వచ్చే విమానాలపై కూడా ఇతర దేశాలు ఆంక్షలు విధించాయి ..కరోనా సమయంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఈ సారి అన్ని దేశాలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి...

Tags :
|
|
|

Advertisement