Advertisement

  • కొత్త కరోనా లక్షణాలను ప్రకటించిన తమిళనాడు ఆరోగ్య శాఖా

కొత్త కరోనా లక్షణాలను ప్రకటించిన తమిళనాడు ఆరోగ్య శాఖా

By: Sankar Sun, 28 June 2020 1:37 PM

కొత్త కరోనా లక్షణాలను ప్రకటించిన తమిళనాడు ఆరోగ్య శాఖా


ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా రోజుకి ఒక కొత్త లక్షణాన్ని చేయిస్తుంది ..అసలే వాక్సిన్ లేకుండా ప్రజలను ముప్పు తిప్పలు పెడ్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు కొత్త కొత్త లక్షణాలతో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ..తాజాగా తమిళనాడులోని అధికారులు ప్రజలకు కరోనా లక్షణాల విషయంలో సరికొత్త సూచనలు చేసారు ..

కరోనా లక్షణాలుగా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు మాత్రమే కాకుండా రుచి తెలియకపోతే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అడయార్‌ మండలం 178వ వార్డు ద్రౌపది అమ్మన్‌ ఆలయ వీధిలో నివసించే 30 ఏళ్ల మహిళకు వారం రోజులుగా ఎలాంటి ఆహారం తిన్నా రుచి తెలియడం లేదు. అదే సమయంలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించలేదు.

దీనితో అనుమానం వచ్చిన ఆమె ఒకవేళ కరోనా వైరస్‌కు గురయ్యానేమోనని తరమణిలోని నిర్ధారణ కేంద్రానికి వైద్యపరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె ఇంట్లో వారికందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే, అదే వార్డులో ఉన్న 40 ఏళ్ల వ్యక్తి ఎలాంటి వాసనలు పసిగట్టలేకపోవడంతో తనకు తానుగా ముందుకొచ్చి వైద్యపరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ... జ్వరం, జలుబు, దగ్గు ఉంటేనే కరోనా కాదని, శరీరంలో కొత్త మార్పులు గుర్తిస్తే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని, నిర్లక్ష్యం చూపరాదని కోరారు.

Tags :
|
|
|

Advertisement