Advertisement

  • నైట్ కర్ఫ్యూ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ముంబై హోటళ్ల యజమానులు..

నైట్ కర్ఫ్యూ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ముంబై హోటళ్ల యజమానులు..

By: Sankar Thu, 24 Dec 2020 10:29 AM

నైట్ కర్ఫ్యూ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ముంబై హోటళ్ల యజమానులు..


కరోనా మహమ్మారి విజృంభణ వలన గత ఏడాదిగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు ప్రజలు ...అయితే ఇటీవల కరోనా మహమ్మారి కొద్దిగా తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే మల్లి సాధారణ జీవితనానికి ప్రజలు వస్తున్నారు..అయితే ఇప్పుడు బ్రిటన్ లో మరొక కొత్త వైరస్ విజృంభణ మొదలయినది..ఇది సాధారణ కరోనా కంటే ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది...దీనితో బ్రిటన్ తో పాటు ఇతర దేశాలలో కూడా ఆంక్షలు విధించారు...

బ్రిటన్‌లో కరోనా మరో రూపం వేగంగా వ్యాప్తిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 5 వరకు రాత్రిళ్లు కర్ఫ్యూ విధించాలని తీసుకున్న నిర్ణయంపై ముంబైలోని హోటల్, రెస్టారెంట్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంపాదించుకునే సమయంలోనే కర్ఫ్యూ అమలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌తో గత తొమ్మిది నెలల నుంచి వ్యాపార సంస్థలన్నీ కుదేలైపోయాయి.

ఆదాయం లేక ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నా రు. కాగా, అన్‌లాక్‌ ప్రక్రియ అమలు చేయడంతో ఇప్పుడిప్పుడే ముంబై జనజీవనం గాడినపడుతోంది. దీంతో కస్టమర్లు మెల్లమెల్లగా ఇంటి నుంచి బయటపడసాగారు. కానీ, ప్రభుత్వం రాత్రి 11 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు కర్ఫ్యూ విధించి పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.దీనితో నైట్ కర్ఫ్యూ విడిస్తే తిరిగి రోడ్డున పడతాము అని షాపుల యజమానులు , హోటల్, రెస్టారెంట్ల యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు...

Tags :
|
|
|

Advertisement