Advertisement

ఆదివారం తెలంగాణలో 199 కొత్త కేసులు నమోదు

By: chandrasekar Tue, 02 June 2020 1:46 PM

ఆదివారం తెలంగాణలో 199 కొత్త కేసులు నమోదు


హైదరాబాద్ నగరంలో కరోనావైరస్ తీవ్రతరం అవుతోంది. తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండగా ఇటీవల నగరంలో కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం తెలంగాణలో 199 కొత్త కేసులు నమోదు కాగా నగరంలో 122 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కూరగాయల వ్యాపారి, క్యాబ్ డ్రైవర్, పోలీసు కానిస్టేబుల్ ఇలా నిత్యం ప్రజలతో మమేకయ్యేవారు కోవిడ్ బారిన పడుతుండటంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో నగరంలో గతంలో కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాల్లోనూ కొత్త కేసులను వస్తున్నాయి. 35 రోజులకుపైగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని శేరిలింగంపల్లి సర్కిల్‌లో 8 కేసులు నమోదయ్యాయి.

గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఉండే ఐటీ ఉద్యోగి, లుంబినీ అవెన్యూలో నివసించే ఓ సీనియర్ సిటిజన్‌కు గురువారం కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ వారంలోనే మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా కొండాపూర్‌లో నలుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు.

new cases,registered,telangana,on,sunday ,ఆదివారం, తెలంగాణలో, 199 కొత్త, కేసులు, నమోదు


లాక్‌డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి రావడంతో కరోనా బారిన పడ్డారు. బేగంపేట, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కొత్త కేసులను గుర్తించారు. భోయిగుడ, నేరేడ్‌మెట్, సీతాఫల్ మండీ కూడా కరోనా ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేరాయి.

కరోనా బారిన పడిన వారు ఆ విషయం తెలియకపోవడంతో వైన్ షాపులు, కూరగాయల మార్కెట్లు, ఇతర ప్రదేశాలకు వెళ్లినట్లు అంగీకరించారని ఒకరినొకరు కలుస్తుండటంతో కొత్త ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారికొరు తెలిపారు.

మే నెలలోనే హైదరాబాద్ నగరంలో 1000కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాలాపూర్, అల్వాల్, సైఫాబాద్, చిలకలగూడ, మంగళ్‌హాట్ ప్రాంతాల్లో గత 10 రోజుల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వల్ల ఇప్పటి వరకూ ఓ పోలీసు కానిస్టేబుల్ మరణించగా, ఆర్టీసీ కండక్టర్ కూడా కరోనా వల్ల మృత్యువాత పడ్డారు.

Tags :
|

Advertisement