Advertisement

కేరళలో కలకలం రేపుతున్న మరొక వ్యాధి..

By: Sankar Sun, 20 Dec 2020 9:42 PM

కేరళలో కలకలం రేపుతున్న మరొక వ్యాధి..


ఓ వైపు కరోనా వైరస్‌ కేసులతో సతమతమవుతున్న కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా వ్యాధి కలకలం రేపుతున్నది. ఉత్తర కేరళలోని కోజికోడ్ జిల్లాలో షిగెలోసిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మాయనాడ్ ప్రాంతంలో 11 ఏండ్ల బాలుడు మరణించగా ఈ వ్యాధి లక్షణాలతో మరింత మంది దవాఖానలో చేరారు.

ఇప్పటి వరకు ఆరుగురికి షిగెలోసిస్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 26 మందికి ఈ వ్యాధి సోకినట్లుగా అనుమానాలున్నాయని పేర్కొంది. వారిలో కొందరు దవాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించింది. షిగెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి గురించి భయాందోళన అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించేందుకు వైద్య నిఫుణులు ప్రయత్నిస్తున్నారని ఆరోగ్య మంత్రి కేకే శైలజ చెప్పారు.

కలుషిత నీటి వల్ల షిగెల్లా బ్యాక్టీరియా సోకినట్లుగా ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తున్నదని వెల్లడించారు. వ్యాధి సోకిన వారి ఇండ్ల నుంచి సేకరించిన నీటి, ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కాచి వడకట్టిన నీటిని తాగాలని ప్రజలకు ఆమె సూచించారు.

Tags :
|

Advertisement