Advertisement

  • నెటిజన్లు ఓ జంతువు ఫొటో చూసి కన్ఫ్యూస్‌ అవుతున్నారు!

నెటిజన్లు ఓ జంతువు ఫొటో చూసి కన్ఫ్యూస్‌ అవుతున్నారు!

By: chandrasekar Tue, 04 Aug 2020 09:27 AM

నెటిజన్లు ఓ జంతువు ఫొటో చూసి కన్ఫ్యూస్‌ అవుతున్నారు!


ఇది గొర్రెనే..కుక్కనే..అని కొందరు.. కాదు.. కుక్కనే అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఇది మంగలికాస్‌ జాతికి చెందిన పంది అట. వాటి వెంట్రుకలు గుబురుగా పెరగడంతో అది గొర్రె, కుక్క మాదిరిగా కనిపిస్తుందట. అమెరికాలోని పీస్ రిడ్జ్ అభయారణ్యంలో ఈ వరాహం ప్రస్తుతం ఉంటోంది. ఇది అంగస్‌ అనే వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చిందట. అందుకే దీన్ని అక్కడి సంరక్షకులు అంగస్‌ అనే పిలుస్తున్నారు.

రైతు యానిమల్‌ వెల్ఫేర్‌ ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన అధికారులకు చిక్కకుండా తక్కువ బరువుతో ఉన్న జంతువులన్నింటిని చంపి పూడ్చిపెట్టాడట. అంగస్‌ ఒక్కటే అక్కడినుంచి తప్పించుకుని వచ్చింది. మొదట వచ్చినప్పుడు చాలా బలహీనంగా ఉండేది. అయితే, రానురానూ ఆరోగ్యకరంగా తయారై, దట్టమైన జుట్టుతో కనిపిస్తోంది. కాగా, దీని ఫొటోను పీస్‌ రిడ్జ్‌ సాంక్చురీ ఫేస్‌బుక్‌లో పెట్టగా, చాలామంది కన్ఫ్యూస్‌ అయ్యారు. ఇది గొర్రె.. లేక కుక్క అని భావించారట. దీంతో అంగస్‌ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tags :

Advertisement