Advertisement

  • గంగూలీ సర్ ..7-30 కి కార్తీక దీపం సీరియల్ ఉంది ..ఐపీయల్ 8 కి పెట్టండి..అభిమాని రిక్వెస్ట్

గంగూలీ సర్ ..7-30 కి కార్తీక దీపం సీరియల్ ఉంది ..ఐపీయల్ 8 కి పెట్టండి..అభిమాని రిక్వెస్ట్

By: Sankar Fri, 04 Sept 2020 10:19 PM

గంగూలీ సర్ ..7-30 కి కార్తీక దీపం సీరియల్ ఉంది ..ఐపీయల్ 8 కి పెట్టండి..అభిమాని రిక్వెస్ట్


కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీయల్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ లో ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే..సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 మ్యాచ్‌లు జరుగుతాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకి బదులుగా 3.30కు, రాత్రి 8 గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి..

ఈ క్ర‌మంలో ఐపీఎల్‌ టైమింగ్స్ మార్చాలంటూ ఓ తెలుగు అభిమాని సౌరవ్ గంగూలీ, చెన్నై ఐపీఎల్, స్టార్ మా ను ట్యాగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో కోరారు. శివ చరణ్ అనే ట్విట‌ర్ యూజ‌ర్ రాత్రి 7.30 గంట‌ల‌కు స్టార్ మాలో కార్తీక దీపం సీరియ‌ల్ వ‌స్తుంద‌ని ఆ స‌మ‌యంలో ఇంట్లో గొడ‌వ‌లు కాకుండా చూడాల‌ని కోరాడు. ‘సౌరవ్ గంగూలీ సర్ ఐపీఎల్ టైమింగ్స్ రాత్రి 7.30 నుంచి 8.00 గంటలకు మార్చండి.

ఎందుకంటే 7.30 స‌మ‌యానికి మా ఇంట్లో ‘కార్తీక దీపం' సీరియల్ చూస్తారు. అస‌లే మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. దయచేసి టైమింగ్స్ మార్చి మా ఇంట్లో గొడవలు జరగకుండా చూడండి సార్.' అని పేర్కొన్నాడు. ఇక శివ చ‌ర‌ణ్‌చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. దీనిపై నెటిజ‌న్లు ఫ‌న్నీ మీమ్స్ క్రియెట్ చేస్తున్నారు.కాగా ఈ ట్వీట్‌పై స్టార్ మా స్పందించడం విశేషం. ‘ఇది చాలా నిజాయితీతో కూడి అభ్య‌ర్థ‌న' ‌అంటూ స‌ద‌రు వ్య‌క్తికి బదులిచ్చింది

Tags :
|

Advertisement