Advertisement

  • మరో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రవేశపెట్టిన నెట్‌ఫ్లిక్స్

మరో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రవేశపెట్టిన నెట్‌ఫ్లిక్స్

By: chandrasekar Thu, 23 July 2020 1:36 PM

మరో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రవేశపెట్టిన నెట్‌ఫ్లిక్స్


అమెరికన్‌ స్ట్రీమింగ్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్ భారతీయ వినియోగదారుల కోసం మరో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రవేశపెట్టింది. మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌, కంప్యూటర్‌ స్క్రీన్లు వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా ఈ ప్లాన్ తీసుకొచ్చింది.

నెలకు రూ.349 చెల్లించడం ద్వారా హెచ్‌డీ కంటెంట్‌ను చూడటానికి వినియోగదారులకు అనుమతి ఉంటుంది. ఐతే టెలివిజన్‌ స్క్రీన్‌లకు మాత్రం ఈ ఆఫర్‌ వర్తించదు. చందాదారులను పెంచుకునే లక్ష్యంతో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్‌ ఆవిష్కరించింది. బేసిక్‌(రూ. 499), స్టాండర్డ్‌ (రూ. 649), ప్రీమియం(రూ. 799) ప్లాన్లను నెట్‌ఫ్లిక్స్‌ అందిస్తున్నది.

ఇప్పటికే ఉన్న చందాదారులు, కొత్త యూజర్ల కోసం మొబైల్‌ + ప్లాన్‌ను భారత్‌లో ఆవిష్కరించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెట్‌ఫ్లిక్స్ గతేడాది రూ.199 ప్లాన్‌ను భారత్‌లో మాత్రమే ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు కేవలం 50లక్షల మంది చందాదారులు మాత్రమే ఉన్నారు. మొబైల్‌ ఓన్లీ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లో స్టాండర్డ్‌ డెఫినిషన్‌ కంటెంట్‌ను కేవలం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే చూసే వెసులుబాటు ఉన్నది.

Tags :

Advertisement