Advertisement

  • భారత న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్

భారత న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్

By: chandrasekar Fri, 10 July 2020 10:49 AM

భారత న్యూస్ ఛానెళ్ల ప్రసారాలు నిలిపివేసిన నేపాల్


నేపాల్‌లో భారత్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌కి చెందిన న్యూస్ ఛానెళ్లను నేపాల్ కేబుల్ టీవీ ఆపరేట్స్ నిలిపేశారు. దూర‌ద‌ర్శ‌న్ మిన‌హా భారత్‌కి చెందిన మిగ‌తా అన్ని న్యూస్ చానెళ్లను నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ నిలిపేశారు. భార‌త్‌కి చెందిన టీవీ ఛానెళ్ల ప్రసారాలను నిలిపేస్తున్నట్లు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు.

భారతీయ టీవీ ఛానెల్స్ ప్రసారాలను నిలిపేయాల్సిందిగా నేపాల్ సర్కార్ నుంచి అధికారికంగా ఆదేశాలు అందనప్పటికీ తామే స్వచ్ఛందంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామని నేపాల్ కేబుల్ ఆపరేటర్స్ తెలిపారు.

నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల ప్రసారాల నిలిపివేతపై నేపాల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి డా యువరాజ్ ఖతివాడ స్పందిస్తూ నేపాల్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా, నేపాల్‌ ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా నేపాల్‌కి వ్య‌తిరేకంగా ప్రసారాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ఇది పొరుగుదేశాలకు చెందిన టీవీ ఛానెళ్లకు కూడా వర్తిస్తుందని ఖతివాడ అన్నారు.

చైనా చేతుల్లో నేపాల్ ఉన్నందువల్లే అక్కడ భారత్‌కి వ్యతిరేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని భారతీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నేపాల్‌లో భూకంపం సంభవించినప్పుడు నేపాల్‌కి భారత్ అండగా నిలిచి ఎంతో సహాయం చేసిందని నేపాల్ ఆ విషయాన్ని మరువొద్దని ప్రజల అభిప్రాయం.

Tags :
|
|

Advertisement