Advertisement

కరోనా బారిన పడిన నేపాల్ స్టార్ స్పిన్నర్

By: Sankar Sat, 28 Nov 2020 8:26 PM

కరోనా బారిన పడిన నేపాల్ స్టార్ స్పిన్నర్


భారత్ లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ ఏడాది ఐపీఎల్ 2020 లో యూఏఈ వేదికగా జరిగింది. అయితే ఈ టోర్నీ ఆరంభంలో చెన్నై జట్టులో కరోనా కలకలం రేపిన ఆ తర్వాత ఎటువంటి సమస్య లేకుండా సాగింది.

అయితే ఈ టోర్నీ ముగిసిన తర్వాత తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపాల్ స్పిన్నర్ సందీప్ లామిచనే కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా థానే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తన పోస్ట్ ''నాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని మీకు తెలపడం నా కర్తవ్యం. అయితే గత బుధవారం నుండి నాకు ఒళ్ళు నొప్పులు పార్రంభమయ్యాయి . అయితే నా ఆరోగ్యం ఇప్పుడు కొంచెం మెరుగుపడుతోంది.

అన్నీ సరిగ్గా జరిగితే నేను తిరిగి మైదానంలోకి వస్తారు. మీ ప్రార్థనలలో నన్ను ఉంచండి "అని లామిచనే పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే లామిచనే తన దేశం కోసం మొత్తం 21 టీ 20 లు, 10 వన్డేలో ఆడి మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌లో 57 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు.

Tags :
|

Advertisement