Advertisement

  • పరోక్షంగా భారత్ మీద విమర్శలు చేసిన నేపాల్ ప్రధాని కెపి ఓలి

పరోక్షంగా భారత్ మీద విమర్శలు చేసిన నేపాల్ ప్రధాని కెపి ఓలి

By: Sankar Mon, 29 June 2020 11:21 AM

పరోక్షంగా భారత్ మీద విమర్శలు చేసిన నేపాల్ ప్రధాని కెపి ఓలి



ఒకవైపు భారత్ చైనాతో సరిహద్దు ఘర్షణలు జరుగుతుంటే మరోవైపు నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతుంది ..కొన్నాళ్ల క్రితం వరకు మంచిగా ఉన్న నేపాల్ ఇటీవలి కాలంలో ఇండియాకు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే కాకుండ భారత భూభాగాలలో ఉన్న వాటిని మావి అంటూ వాళ్ళ దేశంలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తుంది .ఇటీవల భారత్లోని ఒక మూడు భూభాగాలు మావి అని నేపాల్ ప్రధాని కెపి ఓలి సరికొత్త మ్యాప్ ను విడుదల చేసాడు ..

అయితే కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన తర్వాత తనను పదవి నుంచి తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని నేపాల్‌ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలీ ఆరోపించారు. అయితే, తనను గద్దె దించడం అసాధ్యమని ఆదివారం తేల్చిచెప్పారు. ఖాట్మాండూలోని ఓ హోటల్‌లో తనపై కుట్రలకు కార్యాచరణ జరుగుతోందని, ఇందులో ఓ దేశ రాయబార కార్యాలయం చురుగ్గా పాల్గొంటోందని పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.

కాగా భార‌త భూభాగాలైన లిపూలేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాల‌ను నేపాల్‌కు చెందినవంటూ మ్యాప్ రూపొందించి.. దానిపై రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేసిన ఓలీ.. ఈ మ్యాప్ రూప‌క‌ల్ప‌న వ‌ల్లే భార‌త్ త‌న ప్ర‌భుత్వాన్ని కూల‌దోయాల‌నుకుంటోంద‌ని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని ఆస్థిరపర్చేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు

Tags :
|
|
|
|

Advertisement