Advertisement

  • కరోనా కేసుల కారణంగా భారతీయులు దేశంలోకి వచ్చే మార్గాలను సగానికి తగ్గించిన నేపాల్

కరోనా కేసుల కారణంగా భారతీయులు దేశంలోకి వచ్చే మార్గాలను సగానికి తగ్గించిన నేపాల్

By: Sankar Wed, 12 Aug 2020 2:08 PM

కరోనా కేసుల కారణంగా భారతీయులు దేశంలోకి వచ్చే మార్గాలను సగానికి తగ్గించిన నేపాల్



భారత్ మీద ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు చేస్తున్న నేపాల్ తాజాగా భారతీయులు నేపాల్ లోకి ఎంటర్ అయ్యే మార్గాలను తగ్గించింది ఇంతకుముందు ఈ మార్గాలు ఇరవై ఉండగా ఇపుడు పదికి తగ్గించింది..అంతేకాక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేపాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆగస్టు 31 వరకు నిషేధాన్ని పొడిగించింది..

నేపాల్‌లో ఇప్పటి దాక 24 వేల కేసులు నమోదుకాగా 83 మంది మరణించారు.దేశంలో 120 రోజుల త‌ర్వాత లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను పాక్షికంగా ఎత్తివేశారు. దేశంలో మొద‌టి క‌రోనా పాజిటివ్ కేసు మార్చి 24న న‌మోద‌య్యింది. అయితే భౌతిక‌దూరం వంటి నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

కాగా గత కొంతకాలంగా నేపాల్ ప్రధాని కెపి ఓలి భారత్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు ..భారత్ దేశానికి సంబంధించిన భూభాగాలతో మ్యాప్ విడుదల చేయడం , భారత టివి చాన్నెలను బ్యాన్ చేయడం , రాముడు భారత దేశానికి చెందినవాడు కాదని విమర్శలు చేయడం ..ఇలా అనేక విమర్శలను గుప్పిస్తున్నారు ..అయితే ఒలికి సొంత దేశంలోనే మద్దతు లభించడం లేదు ..భారత్ మీద ఓలి చేస్తున్న వాక్యాలు పట్ల సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు ..

Tags :
|
|

Advertisement