Advertisement

  • పక్కా ప్లాన్‌తో ఇంట్లో చోరీ చేసిన నేపాల్‌ ముఠా అరెస్ట్‌

పక్కా ప్లాన్‌తో ఇంట్లో చోరీ చేసిన నేపాల్‌ ముఠా అరెస్ట్‌

By: chandrasekar Tue, 13 Oct 2020 4:19 PM

పక్కా ప్లాన్‌తో ఇంట్లో చోరీ చేసిన నేపాల్‌ ముఠా అరెస్ట్‌


పోలీసులు నేపాలీ ముఠాను రాయదుర్గం చోరీ కేసులో సోమవారం అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు వ్యక్తులను మాదాపూర్‌ ఎస్‌ఓటీ అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గంలోని బీఎన్‌ఆర్‌ హిల్స్‌లో నివాసం ఉంటున్న బోర్‌వెల్‌ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరింట్లో నేపాల్‌కు చెందిన రాజేందర్‌ అలియాస్‌ రవి ఏడాది కిందట హౌస్‌ కీపింగ్‌ పనికి చేరాడు. అప్పటి నుంచి నమ్మకంగా పనిచేశాడు. కొన్నిరోజుల తర్వాత రవి తన సోదరి సీతను తీసుకొచ్చి అదే ఇంట్లో హౌస్‌ కీపింగ్‌ పనిలో చేర్చాడు. 15 రోజుల కిందట నేపాల్‌కు చెందిన మనోజ్‌, జానకి అనే ఇద్దరిని కూడా తీసుకొచ్చాడు. మనోజ్‌ హౌస్‌ కీపింగ్‌కు, జానకి వంట పనికి కుదిరారు. వీరందరికీ ఇంటి సెల్లార్‌లో ఉన్న సర్వెంట్‌ క్వార్టర్‌ను మధుసూదన్‌రెడ్డి కేటాయించారు.

పక్కా ప్లాన్‌తో ఇంట్లో చేరిన వీరు అదను కోసం వేచి చూశారు. గత సోమవారం రాత్రి మధుసూదన్‌రెడ్డి కుటుంబం కోసం పప్పు, చపాతీ చేశారు. అందులో మత్తుమందు కలిపి మధుసూదన్‌రెడ్డి భార్య పప్పు తినకపోవడంతో గ్రీన్‌ టీలో మత్తుమందు కలిపి ఇచ్చారు. కుటుంబమంతా స్పృహ లేకుండా పడిపోవడంతో ఇంట్లో ఉన్న రూ.40లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. తెల్లవారు జామున మెలకువ వచ్చిన మనుమడు మధుసూదన్‌రెడ్డి భార్య కట్లు విప్పడంతో ఆమె తన బంధువులకు సమాచారం అందించారు. అప్పటికీ స్పృహ కోల్పోయే ఉన్న మధుసూదన్‌రెడ్డితో పాటు కుటుంబీకులను నితీశ్‌రెడ్డి, దీప్తిరెడ్డిని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముఠా కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో ముఠాలోని ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేసారు. వారి నుంచి డబ్బు, నగలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :
|
|

Advertisement