Advertisement

  • భారత టీవీ ఛానెళ్లపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసిన నేపాల్ ..

భారత టీవీ ఛానెళ్లపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసిన నేపాల్ ..

By: Sankar Tue, 14 July 2020 7:46 PM

భారత టీవీ ఛానెళ్లపై నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసిన నేపాల్ ..



భారత్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ మిత్ర దేశం అయినా భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతుంది హిమాలయ దేశం నేపాల్ ..ఇప్పటికే ఆ దేశ ప్రధాని భారత్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే ..అయితే కేవలం ప్రధాని మాత్రమే కాకుండా ఆ దేశ కేబుల్ ఆపరేటర్లు కూడా భారత్ మీద కయ్యానికి అన్నట్లు గత వారం ఇండియాకు చెందిన టీవీ చాన్నెలను నేపాల్లో నిషేదించారు ..దీనిమీద సర్వత్ర విమర్శలు వచ్చాయి ..

దీనితో భారత వార్తా చానళ్లపై నిషేధం విధించిన అక్కడి కేబుల్ ఆపరేటర్లు తాజాగా ఈ నిర్ణయాన్ని పాక్షికంగా ఉపసంహరించుకున్నారు. కొన్ని చానళ్లపై బ్యాన్ ఎత్తేస్తున్నట్టు కేబుల్ ఆపరేటర్ల సంఘం వైస్ ప్రెసిడెంట్ ఇటీవల ప్రకటించారు. అయితే అభ్యంతరకర వార్తలను ప్రచారం చేస్తున్న చానళ్లపై మాత్రం నిషేధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

గత గురువారం నాడు భారత్ చానళ్లను నిషేధిస్తున్నట్టు నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నేపాలీల సెంటిమెంట్లను కించపరుస్తున్నారని ఆరోపిస్తూ అక్కడి కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే భారత్ మాత్రం ఈ విషయమై ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు. ఈ లోపే.. తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు.

Tags :
|
|
|
|
|
|

Advertisement