Advertisement

  • నేపాల్ మరో దుందుడుకు చర్య ..భారత టివి ఛానెళ్ల నిలిపివేత

నేపాల్ మరో దుందుడుకు చర్య ..భారత టివి ఛానెళ్ల నిలిపివేత

By: Sankar Fri, 10 July 2020 10:14 AM

నేపాల్ మరో దుందుడుకు చర్య ..భారత టివి ఛానెళ్ల నిలిపివేత



భారత్ మీద విమర్శలు చేస్తున్న నేపాల్ ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసింది ..ఇటీవల నేపాల్, భారత్ మధ్య చోటు చేసుకున్న వివాదం, అక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలో దూర‌దర్శన్ మిన‌హా భార‌త టీవీ ఛానెళ్లన్నింటినీ నిలిపివేస్తున్నట్లు నేపాల్ కేబుల్ ఆపరేటర్లు గురువారం ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని.. తాము స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

అయితే నేపాల్‌లో భారత టీవీ ఛానెళ్ల కార్యక్రమాలను నియంత్రించాలంటూ మాజీ డిప్యూటీ ప్రధాని, అధికార పార్టీ ప్రతినిధి నారాయణ కాజీ శ్రేష్ఠ గురువారం ఉదయం పిలుపునిచ్చారు. ఆయన ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

భారత టీవీ ఛానెళ్లలో తమ దేశానికి, దేశ ప్రధాని కేపీ శ‌ర్మ ఓలీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయని.. నేపాలీల ఆత్మ గౌరవానికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని కేబుల్ ఆపరేటర్లు పేర్కొన్నారు. పాకిస్థాన్, చైనాకు చెందిన టీవీ ఛానెళ్ల ప్రసారాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.అయితే చైనా , పాకిస్తాన్ మాయలో పది మిత్ర దేశమైన భారత్ తో నేపాల్ అనవసరంగా వివాదాలు పెట్టుకుంటుంది ..ఇప్పటికే నేపాల్ ప్రధాని కెపి ఓలి భారత్ మీద విమర్శలు చేసిన నేపథ్యంలో అతడి పదవికే ముప్పు వచ్చింది ..

Tags :
|
|
|
|
|

Advertisement