Advertisement

టెస్ట్ లో నెగటివ్.... ప్రాణం తీసిన కరోనా భయం

By: Dimple Fri, 17 July 2020 1:17 PM

టెస్ట్ లో నెగటివ్....  ప్రాణం తీసిన కరోనా భయం


కరోనా భయం జనాల్ని వణికిస్తోంది.. చిన్న లక్షణం కనిపించినా ఆందోళన పెరిగిపోతోంది. భయంతో పరీక్షలు చేయించుకుని.. ఆ రిపోర్టు వచ్చే వరకు ఆగలేకపోతున్నారు కొందరు. ఇటీవల కరోనా భయంతో కర్నూలు జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటు.. విజయవాడకు చెందిన వ్యక్తి ఏకంగా ఇల్లు వదిలి పారిపోయారు. కానీ సీన్ కట్ చేస్తే ఇద్దరికీ కరోనా నెగిటివ్‌గా తేలింది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరో ఘటన జరిగింది.. కరోనా టెన్షన్‌తో మరో గుండె ఆగిపోయింది.


ఏలూరు కోటదిబ్బ జూనియర్‌ కాలేజీ ఆవరణలో సంజీవని బస్సులో కరోనా పరీక్షలు నిర్వహించారు. టూటౌన్‌ పవరుపేటకు చెందిన ఓ 65 ఏళ్ల పెద్దాయన పరీక్ష చేయించుకున్నారు. టెస్ట్ రిపోర్ట్ కోసం అక్కడే వేచి ఉన్నాడు.. అక్కడే మిగిలిన కుటుంబ సభ్యులు కూడా పరీక్షలు చేయించుకుంటున్నారు. కుమారుడు వృద్ధుడి దగ్గరకు వచ్చి పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని చెప్పగా.. వెంటనే కుప్పకూలిపోయారు. అక్కడున్న 108 సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు.


కరోనా టెస్టుల్లో నెగిటివ్ వచ్చినా.. ఆయన సరిగా అర్థం చేసుకోలేకపోయారని.. పాజిటివ్‌ అనుకుని ఆందోళనతో కుప్పకూలి చనిపోయారని అనుమానిస్తున్నారు. పాపం కరోనా పరీక్ష కోసం వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. కానీ నెగిటివ్ అని తేలినా మనిషి లేకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :
|
|
|

Advertisement