Advertisement

  • కరోనా వ్యాక్సిన్‌లో ప్రతికూల మార్పులు... HIV పాజిటివ్‌గా నిర్ధారణ

కరోనా వ్యాక్సిన్‌లో ప్రతికూల మార్పులు... HIV పాజిటివ్‌గా నిర్ధారణ

By: chandrasekar Sat, 12 Dec 2020 11:04 AM

కరోనా వ్యాక్సిన్‌లో ప్రతికూల మార్పులు... HIV పాజిటివ్‌గా నిర్ధారణ


ఎవరు ఊహించని విధంగా కరోనా వాక్సిన్ లో ప్రతికూల మార్పులు ఎదురైనట్లు తెలిసింది. వాక్సిన్ ప్రభావం వల్ల వాలంటీర్ లలో HIV పాజిటివ్ గా గుర్తించబడింది. ఆస్ట్రేలియా లో అభివృద్ధి చేసిన వాక్సిన్ వల్ల ఏర్పడ్డ ప్రతికూల మార్పుల వల్ల వెంటనే ఆ వాక్సిన్ ను రద్దు చేశారు. ఇందుకోసం అక్కడ క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ మరియు సీఎస్‌ఎల్‌ ఔషధ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి పరిచిన వాక్సిన్ లో ఈ ప్రతికూల ప్రభావం చోటుచేసుకుంది. మొదటి దశ ట్రయల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఆ తరువాత అందించిన రెండవ మరియు మూడవ దశలలో ప్రతికూల ప్రభావం చూపినట్లు గుర్తించారు.

ఈ వాక్సిన్ ఇవ్వడంవల్ల ఏర్పడిన యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలో గుర్తించబడ్డాయి.అందువల్ల సాధారణ వ్యక్తులకు కూడా HIV పాజిటివ్ గా టెస్టుల్లో గుర్తించారు. కానీ దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెపుతున్నారు. ఈ వాక్సిన్ తీసుకున్న వారిలో ఉత్పత్తి చేయబడ్డ యాంటీబాడీలు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల్లో మాత్రమే ప్రభావం చూపుతున్నాయని, కానీ వారికి HIV సోకలేదని తెలిపారు. వీరికి కొంత కాలం తరువాత టెస్ట్ చేస్తే వీరికి నెగటివ్ గా గుర్తించారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రభుత్వం వీరు తయారు చేసే వాక్సిన్ ను కొనుగోలు చేయుటకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దు చేయబడింది.

Tags :

Advertisement