Advertisement

సుప్రీం సూచనలతో నీట్ పరీక్ష ఫలితాలు వాయిదా...

By: chandrasekar Mon, 12 Oct 2020 6:09 PM

సుప్రీం సూచనలతో నీట్ పరీక్ష ఫలితాలు వాయిదా...


నీట్ 2020 పరీక్ష ఫలితాల ప్రకటనను అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేశారు. కరోనా కంటైన్మైంట్ జోన్లలో ఉండి పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు ఈ 14న పరీక్ష నిర్వహించాలని సుప్రీం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది. వారితో కలిపి పరీక్ష రాసిన విద్యార్థులందరి ఫలితాలను ఈ 16న ఫలితాలు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం సూచనలతో నీట్ పరీక్ష ఫలితాలు వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు ఈ నెల 14న పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అనంతరం ఈ నెల 16న నీట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. నీట్ 2020 పరీక్షను సెప్టెంబర్ 13న నిర్వహించారు. దేశంలో కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు, కట్టుదిట్టమైన ఏర్పట్ల నడుమ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష రాయడానికి దేశ వ్యాప్తంగా 15.97 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 13 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 542 మెడికల్ కళాశాలల్లోని 80, 005 సీట్లను భర్తీ చేయనున్నారు. దీంతో పాటు 313 దంత వైద్య కళాశాలల్లోని 26, 949 సీట్లను సైతం భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా నీట్ లో భాగమయ్యాయి. ఈ సారి నీట్ పరీక్ష కట్ మార్కు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడమేనని తెలుస్తోంది.

Tags :
|

Advertisement