Advertisement

దోమ‌ల బెడద నుండి తప్పించుకోవాలా?

By: chandrasekar Fri, 25 Sept 2020 09:01 AM

దోమ‌ల బెడద నుండి తప్పించుకోవాలా?


దోమ‌ల వల్ల మనుషులకు అనేక రకాల వ్యాధులు సోకుతుంటాయి. ఈ దోమ‌ల నుండి రక్షించుకోడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంటాము. వీటినుండి రక్షించుకోడానికి కొన్ని ఉపాయాలు వున్నాయి. ఏ సీజ‌న్‌లో అయినా కొన్ని చోట్ల దోమ‌ల బెడ‌ద మాత్రం త‌గ్గ‌దు. ఇంటి చుట్టుప‌క్క‌ల డ్రైనేజీ, మురికి కాలువ‌లు, గుంట‌లు ఇలా ఏవి ఉన్నా అక్క‌డ ఈగ‌లు, దోమ‌ల సహారం ఎక్కువ‌గా ఉంటుంది. వీటి ద్వారానే జ్వ‌రాలు, డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధుల బారిన ప‌డుతున్నారు.

వివిధ రకాల వత్తుల నుండి పలు రకాల లిక్విడ్ లు మార్కెట్లో అందుబాటులో వున్నాయి. దోమ‌ల‌ను ఇంటి ఆర‌ణ‌లోకి రాకుండా చేయ‌డానికి మార్కెట్లో చాలానే లభ్యమవుతున్నాయి. అయితే డ‌బ్బు పెట్టి దోమ‌ల‌ను త‌రిమేకంటే స‌హ‌జ ప‌ద్ద‌తుల ద్వారా త‌రిమికొట్ట‌వ‌చ్చు. కొంత‌మంది పొగ పెడుతుంటారు. ఈ పొగ దెబ్బ‌కి కూడా దోమ‌లు రావు. వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్‌తో ఇలా చేస్తే దోమ‌లు ఇంట్లోకి కాదు క‌దా చుట్టు ప‌క్క‌ల కూడా ఉండ‌వు.

ఇంటిలో దొరికే వస్తువులు వుపయోగించి దోమ‌లు రాకుండా చేసే ఈ ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూస్తాం. వెల్లుల్లి వాస‌న అంటే దోమ‌ల‌కు అస‌లు ప‌డ‌దు. అందుకే వెల్లుల్లి రెబ్బ‌లు క‌నుక తింటే దోమ‌లు మీ వ‌ద్ద‌కు రాకుండా ఉంటాయి. తులసి చెట్టు భార‌తీయుల ప్ర‌తిఒక్క‌రి ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఈ చెట్లు ఎక్క‌డైనా సులువుగా పెరుగుతుది.

మాములుగా తులసి ఆకులు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తులసి ఆకుల నుంచి సేక‌రించిన నూనె దోమ‌ల‌ను త‌రిమికొట్ట‌డానికి ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. దోమ‌ల‌ను త‌రిమికొట్ట‌డానికి సువాస‌న‌లున్నాయి. వీటిని క‌నుక ఇంట్లో ఉప‌యోగిస్తుంటే దోమ‌లు రాకుండా ఉంటాయి. ఇందులో సిట్రోనెల్లా, లవంగం, సెడార్ వుడ్, లావెండర్, యూకలిప్టస్, పిప్పరమెంటు, రోజ్మేరీ, లెమ‌న్‌గ్రాస్,‌ మరియు జెరాని. వీటిని వాడడం వల్ల దోమలు మన దరిదాపుల్లోకి కూడా రాదు.

Tags :
|
|

Advertisement