Advertisement

  • ఇక నుంచి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ ఉండాల్సిందే

ఇక నుంచి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ ఉండాల్సిందే

By: Sankar Fri, 16 Oct 2020 9:50 PM

ఇక నుంచి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ ఉండాల్సిందే


గ్యాస్ సిలిండర్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు.

గ్యాస్ బుక్ చేసుకునే సమయంలో రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓ నెంబర్ వస్తుంది. అది వన్ టైం పిన్ నెంబర్ వంటిది. బుక్ చేసుకున్న గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ కి పిన్ నెంబర్ చెప్తేనే బుకింగ్ చేసుకున్న గ్యాస్ సిలిండర్ ను డెలివరీ చేస్తారు. లేదంటే డెలివరీ క్యాన్సిల్ అవుతుంది.

ఒకవేళ గ్యాస్ రిజిస్ట్రేషన్ సమయంలో మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వకుంటే, గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గర నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అడ్రస్ మారినా, లేదా ఫోన్ నెంబర్ మారినా వెంటనే గ్యాస్ బుకింగ్ స్టేషన్ కు వెళ్లి అక్కడ అడ్రస్ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూల్స్ నవంబర్ 1 నుంచి అమలులోకి రాబోతున్నది.

Tags :
|
|

Advertisement