Advertisement

  • నిహారిక, చైతన్యల పెళ్లి తేదీని ఖరారు చేసిన కుటుంబ సభ్యులు

నిహారిక, చైతన్యల పెళ్లి తేదీని ఖరారు చేసిన కుటుంబ సభ్యులు

By: chandrasekar Thu, 05 Nov 2020 10:44 AM

నిహారిక, చైతన్యల పెళ్లి తేదీని ఖరారు చేసిన కుటుంబ సభ్యులు


అందరూ ఎదురు చూస్తున్న నిహారిక, చైతన్యల పెళ్లి తేదీని కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 13న నిహారిక, చైతన్యల నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. అప్పటి నుంచి వీరి వివాహ తేది, వేదిక గురించి రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. మొత్తానికి నిహారిక పెళ్లి తేదీ, వేదికను మెగా ఫ్యామిలీ ఖరారు చేసింది.

నిహారిక, చైతన్యలకు డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో వివాహం జరగనుంది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడే ఈ జొన్నలగడ్డ వెంకట చైతన్య. సరిగ్గా లాక్‌డౌన్ సమయంలో నిహారిక తనకు కాబోయే భర్తను పరిచయం చేశారు. ఆ తరవాత కొన్ని రోజులకే వీరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది.

దేశంలో కొవిడ్-19 నిబంధనలు అమలులో ఉండటంతో కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ ఈ నిశ్చితార్థ వేడుక జరిగింది. పవన్ కళ్యాణ్ మినహా మెగా హీరోలంతా ఈ వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు.

Tags :
|

Advertisement