Advertisement

  • ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో దాదాపు 5 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో

ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో దాదాపు 5 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో

By: chandrasekar Wed, 11 Nov 2020 09:41 AM

ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో దాదాపు 5 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో


ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో దాదాపు 5 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో వున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ ఏడాది విమాన ప్రయాణ డిమాండ్ 75 శాతం కుప్పకూలింది. దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమలో దాదాపు 5 మిలియన్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి. ఈ విషయాలను వెల్లడిస్తూ గ్లోబల్ ఏవియేషన్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) హెచ్చరించింది. కొవిడ్‌-19 సంబంధిత సరిహద్దు పరిమితులు, నిర్బంధ చర్యల ప్రభావం విమానయాన పరిశ్రమను, గ్రౌండింగ్ విమానాలు, మౌలిక సదుపాయాలు, విమానాల తయారీ సామర్థ్య పరిశ్రమలో పనిలేకుండా పోయింది. దీంతో కరోనా ప్రభావం చూపినప్పటి నుంచి విమానయాన పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా విమానాలు నిలిచిపోవడం, సర్వీసులపై ఆధారపడే ఇతర సంస్థలు కూడా మూతపడటంతో లక్షల మంది ఉద్యోగాలు ప్రభావితమయ్యాయి.

కరోనా వల్ల ఏవియేషన్ పరిశ్రమలో ఏర్పడిన ఉపాధి విపత్తును నివారించడానికి అత్యవసరంగా ప్రభుత్వ జోక్యం చేసుకోవాలని పిలుపునిస్తూ ఏటీఏ, అంతర్జాతీయ రవాణా కార్మికుల సమాఖ్య (ఐటీఎఫ్) సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ యాక్షన్ గ్రూప్ నుంచి వచ్చిన అంచనాలు 4.8 మిలియన్ల ఏవియేషన్ కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని సూచిస్తున్నాయి. ఏవియేషన్ రంగం ఉపాధి విపత్తును ఎదుర్కొంటున్నది. ప్రస్తుత పరిస్థితులలో కేవలం 8.5 నెలల నగదు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పదివేల ఉద్యోగాలు పోయాయి. ప్రభుత్వాలు ఎక్కువ ఆర్థిక ఉపశమనం ఇవ్వకపోతే ఇవి వందల వేలకు పెరిగే అవకాశం ఉంది. దేశాలను అనుసంధానించడానికి, అవసరమైన సరుకులను మోసుకెళ్ళడానికి ఏవియేషన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

విమాన ప్రయాణాలకు సరిహద్దులను సురక్షితంగా తిరిగి తెరవడానికి ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. ప్రయాణీకులు మళ్లీ ప్రయాణించే విశ్వాసం పాదుకొల్పాలని ఐఏటీఏ డైరెక్టర్ జనరల్, సీఈఓ అలెగ్జాండర్ డీ జునియాక్ అన్నారు. ప్రపంచ విమానయాన పరిశ్రమ సుదీర్ఘ సంక్షోభ స్థితిలో ఉంది. ఈ సంవత్సరం చివరినాటికి దాదాపు 80 శాతం వేతన భర్తీ పథకాలు నిలిచిపోతాయి. ప్రభుత్వాల తక్షణ జోక్యం లేకుండా పరిశ్రమ ఇప్పటివరకు చూసిన అతిపెద్ద ఉద్యోగ సంక్షోభాన్ని చవిచూడటం ఖాయం. ఉపశమనం, పునరుద్ధరణ, సంస్కరణలతో ఉద్యోగ సంక్షోభాన్ని నివారించవచ్చు అని ఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ కాటన్ చెప్పారు. ఇందుకోసం పభుత్వం చర్యలు చెప్పట్టాలని తెలిపారు.

Tags :

Advertisement