Advertisement

  • మారడోనా "హ్యాండ్ అఫ్ గాడ్ " గోల్ జెర్సీ 15 కోట్లు పలికే అవకాశం

మారడోనా "హ్యాండ్ అఫ్ గాడ్ " గోల్ జెర్సీ 15 కోట్లు పలికే అవకాశం

By: Sankar Sun, 29 Nov 2020 10:20 PM

మారడోనా "హ్యాండ్ అఫ్ గాడ్ " గోల్ జెర్సీ 15 కోట్లు పలికే అవకాశం


అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా మానియా ఏ మాత్రం తగ్గలేదు. కండ్లు చెదిరే కళాత్మక ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దివంగత మారడోనా..1986 ప్రపంచకప్‌లో ధరించిన జెర్సీకి రికార్డు ధర పలికే అవకాశం కనిపిస్తున్నది.

ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' గోల్‌ చేసినప్పుడు మారడోనా వేసుకున్న జెర్సీ అమ్మకానికి పెడితే రూ.14.79 కోట్లు పలికే చాన్స్‌ ఉందని గోల్డీన్‌ ఆక్షన్‌కు చెందిన డేవిడ్‌ అమెర్మన్‌ రాయిటర్స్‌తో అన్నాడు. ప్రస్తుతం మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ మ్యూజియంలో ఈ జెర్సీ ఉంది.

వివాదాస్పద గోల్‌గా వార్తల్లోకెక్కిన ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' జెర్సీని మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్టీవ్‌ హాడ్జ్‌కు మారడోనా స్వయంగా అందజేశాడు. మారడోనా మాయాజాలంతో 1986లో తొలిసారి అర్జెంటీనా ప్రపంచకప్‌ను ముద్దాడింది.

Tags :
|

Advertisement