Advertisement

  • ఎన్టీఎస్సీ 2020-21 షెడ్యూల్ విడుద‌ల చేసిన ఎన్సీఈఆర్టీ

ఎన్టీఎస్సీ 2020-21 షెడ్యూల్ విడుద‌ల చేసిన ఎన్సీఈఆర్టీ

By: chandrasekar Wed, 28 Oct 2020 9:54 PM

ఎన్టీఎస్సీ 2020-21 షెడ్యూల్ విడుద‌ల చేసిన ఎన్సీఈఆర్టీ


ఎన్టీఎస్సీ 2020-21 షెడ్యూల్‌ను నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ ఎడ్యుకేష‌న‌ల్ రిసెర్చ్ అండ్ ట్ర‌యినింగ్ విడుద‌ల‌చేసింది. ఈ ప‌రీక్ష‌ను రెండు విడుత‌ల్లో నిర్వ‌హిస్తారు. మొద‌టి విడుత ప‌రీక్ష‌ రాష్ట్ర‌స్థాయిలో ఉంటుంది. అందులో అర్హ‌త పొందిన‌వారు జాతీయ‌స్థాయి ప‌రీక్ష‌కు అర్హ‌త సాధిస్తారు. రాష్ట్ర స్థాయి ప‌రీక్ష‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ‌ను రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు నిర్వహిస్తాయి. ప‌రీక్ష‌ను డిసెంబ‌ర్ 13న నిర్వ‌హించ‌నున్నారు. జాతీయ స్థాయిలో జ‌రిగే రెండో విడుత ప‌రీక్ష‌ను వ‌చ్చే ఏడాది జూన్ 13న నిర్వ‌హిస్తారు.

ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల్లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అదేవిధంగా దూర‌విద్యావిధానంలో మొద‌టిసారి ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నవారు కూడా ఈ ప‌రీక్ష‌కు అర్హుల‌ని ఎన్సీఈఆర్టీ ప్ర‌క‌టించింది. అయితే విద్యార్థులు 18 ఏండ్ల లోపువారై ఉండాల‌ని పేర్కొంది. ఈ ప‌రీక్ష‌ల్లో రెండు పేప‌ర్లు ఉంటాయి. మొద‌టి పేప‌ర్‌లో మెంట‌ల్ ఎబిలిటీ (మ్యాట్‌)కి సంబంధించిన ప్ర‌శ్న‌లు, రెండో పేప‌ర్‌లో స్కొలాస్టిక్ ఎబిలిటీ టెస్ట్ (స్యాట్‌)కి సంబంధించిన ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి పేప‌ర్‌లో 100 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక్క మార్కు చొప్పున మొత్తం వంద మార్కులు ఉంటాయి. ప‌రీక్ష‌ను రెండ‌గంట‌ల వ్య‌వ‌ధిలో రాయాల్సి ఉంటుంది. మొద‌టి విడుత ప‌రీక్ష‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి మార్కులు కోత ఉంటుంది. అయితే రెండో విడుత‌లో నెగెటివ్ మార్కింగ్ లేదు.

Tags :
|

Advertisement