Advertisement

నాయిని మరణం రాష్ట్రానికి, తెరాస కు తీరని లోటు

By: Sankar Thu, 22 Oct 2020 09:25 AM

నాయిని మరణం రాష్ట్రానికి, తెరాస కు తీరని లోటు


మాజీ హోంశాఖ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి అపోలో హాస్పిటల్‌లో నాయిని నర్సింహారెడ్డి కన్నుమూయగా.. నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు.

రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నాయిని నర్సింహారెడ్డి మృతిపై సంతాపం ప్రకటించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తని కొనియాడారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా పోలీస్‌శాఖ బలోపేతానికి కృషి చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మృతి సంతాపం తెలిపి, కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.

నాయిని నర్సింహారెడ్డి మృతికి సంతాపం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన లేని లోటు రాష్ట్రానికి తీరదన్నారు. కార్మిక, రాజకీయ నేతగా తెలంగాణ ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌తో కలిసి నర్సన పోరాటం చేశారని, రాష్ట్ర తొలి హోంమినిష్టర్‌గా పని చేసి శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేశారన్నారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags :
|

Advertisement