Advertisement

  • శిక్షణ విమానం కూలిన ఘటనలో నేవీ పైలట్ మృతదేహం లభ్య౦....

శిక్షణ విమానం కూలిన ఘటనలో నేవీ పైలట్ మృతదేహం లభ్య౦....

By: chandrasekar Tue, 08 Dec 2020 3:56 PM

శిక్షణ విమానం కూలిన ఘటనలో నేవీ పైలట్ మృతదేహం లభ్య౦....


నవంబర్‌ 26న మిగ్‌-29కే శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిన ఘటనలో ఒక పైలట్‌ను నేవీ సిబ్బంది కాపాడగలిగారు.

అయితే మరో పైలట్‌ నిశాంత్‌ సింగ్‌ జాడ తెలియలేదు. దీంతో నాటి నుంచి అతడి కోసం అరేబియా సముద్రంలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.

చివరకు పది రోజుల తర్వాత నిశాంత్‌ సింగ్‌ అవశేషాలను సోమవారం కనుగొన్నారు. గోవా తీరానికి 30 మైళ్ల దూరంలోని సముద్రం నీటి లోపల, 70 అడుగుల మీటర్ల లోతులోని సముద్రగర్భం వద్ద అతడి మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు.

నిబంధనల ప్రకారం నిశాంత్‌ సింగ్‌ మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కుటుంబానికి అప్పగిస్తామని నేవీ అధికారులు చెప్పారు.

Tags :
|
|

Advertisement