Advertisement

  • న్యూ వైరస్ దెబ్బకు భూటాన్ లో వారంపాటు దేశవ్యాప్త లాక్ డౌన్....

న్యూ వైరస్ దెబ్బకు భూటాన్ లో వారంపాటు దేశవ్యాప్త లాక్ డౌన్....

By: Sankar Wed, 23 Dec 2020 12:05 PM

న్యూ వైరస్ దెబ్బకు భూటాన్ లో వారంపాటు దేశవ్యాప్త లాక్ డౌన్....


కరోనా మహమ్మారి కొద్దిగా తగ్గుముఖం పట్టింది అని ఆనందపడేలోపు మరొక వైరస్ ప్రపంచం మీదకు దూసుకువస్తుంది...ఇప్పటికే బ్రిటన్ లో ప్రారంభం అయిన ఈ వైరస్ ఇప్పటికే యూరోప్ దేశాలకు పాకింది..దీనితో యూరోప్ లో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి....

దీనితో దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తూ భూటాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 7 రోజుల పాటు ఈ లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. రాజధాని థింఫూతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో... కోవిడ్ వ్యాప్తి పెరగడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా అన్ని అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయనీ.. స్కూళ్లు, సంస్థలు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు మూసివేస్తామని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.

కాగా, కరోనా వైరస్‌ విజృంభనతో గతంలోనూ ఈ తరహా లాక్‌డౌన్‌ను విధించింది భూటాన్ ప్రభుత్వం.. కేసులు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరగడంతో.. మరోసారి లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.

Tags :
|
|

Advertisement