Advertisement

  • జాతీయస్థాయి రిపోర్ట్‌కార్డు ప్రకటన...రెండేండ్లలోపే పిటిషన్ల విచారణ...

జాతీయస్థాయి రిపోర్ట్‌కార్డు ప్రకటన...రెండేండ్లలోపే పిటిషన్ల విచారణ...

By: chandrasekar Wed, 18 Nov 2020 3:52 PM

జాతీయస్థాయి రిపోర్ట్‌కార్డు ప్రకటన...రెండేండ్లలోపే పిటిషన్ల విచారణ...


తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌కు వచ్చిన పిటిషన్లను 20 నెలల నుంచి రెండేండ్ల కాలంలో విచారణ పూర్తిచేసి తగిన ఆదేశాలు ఇస్తున్నదని 2019-20 సమాచార హక్కు కమిషన్స్‌ జాతీయస్థాయి రిపోర్ట్‌కార్డు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్‌కు వచ్చిన పిటిషన్లపై 4 నుంచి 8 ఏండ్ల వరకు విచారణ కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో సమాచారహక్కు కమిషన్‌లో 8 ఏండ్ల 9 నెలలు పడుతున్నదని నివేదికలో తెలిపింది. దేశంలోని 9 రాష్ట్రాల్లో ప్రధాన కమిషనర్లు లేరని, దీంతో చాలా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నది.

ఈ ఏడాది ఆగస్టు నుంచి కేంద్ర సమాచారహక్కు ప్రధాన కమిషనర్‌ లేరని ఈ రిపోర్ట్‌ కార్డు వెల్లడించింది. రాజస్థాన్‌లో 2018 నుంచి, ఉత్తరప్రదేశ్‌, గోవా, నాగాలాండ్‌లో 8 నెలలుగా, మణిపూర్‌లో 10 నెలలుగా సమాచార హక్కు ప్రధాన కమిషనర్లు లేరని తెలిపింది. కేంద్ర సమాచారహక్కు కమిషన్‌లో పూర్తిస్థాయిలో కమిషనర్లు లేకపోవడం వల్ల 36,500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రిపోర్ట్‌ కార్డు ప్రకటించింది. తెలంగాణలో కమిషన్‌ ఏర్పాటైన తర్వాత అప్పటికే పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ సత్వరంగా విచారణ చేసింది. తాజాగా పూర్తిస్థాయిలో సమాచార హక్కు కమిషనర్లు ఉండటంతో దరఖాస్తుల విచారణ చాలా వేగంగా జరుగుతున్నదని పేర్కొన్నది.

Tags :

Advertisement