Advertisement

  • కోలీవుడ్ లో మరొక విషాదం ..ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూత

కోలీవుడ్ లో మరొక విషాదం ..ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూత

By: Sankar Mon, 14 Dec 2020 8:35 PM

కోలీవుడ్ లో మరొక విషాదం ..ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్  కన్నుమూత


2020 లో ఒకవైపు కరోనా కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే మరోవైపు సినీ పరిశ్రమలో మరణాలు తీవ్ర విషాదాలని నింపుతున్నాయి..నాలుగు రోజుల కిందట కోలీవుడ్ లో యువ టివి నటి అకాల మరణం నుంచి ఇంకా తేరుకోకముందే మరొక ప్రముఖ వ్యక్తి మృతి చెందాడు..

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ జాతీయ అవార్డు గ్రహీత పి. కృష్ణమూర్తి తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయసు 77 ఏళ్లు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబంతో సహా చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది.

ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చాలా మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళ సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరిచిపోలేనివని... ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని పేర్కొంటున్నారు.

Tags :

Advertisement