Advertisement

  • జాతీయ అవార్డులు పొందిన ప్రముఖ నటి సురేఖా సిక్రి కి బ్రెయిన్ స్ట్రోక్

జాతీయ అవార్డులు పొందిన ప్రముఖ నటి సురేఖా సిక్రి కి బ్రెయిన్ స్ట్రోక్

By: chandrasekar Wed, 09 Sept 2020 09:32 AM

జాతీయ అవార్డులు పొందిన ప్రముఖ నటి సురేఖా సిక్రి కి బ్రెయిన్ స్ట్రోక్


జాతీయ అవార్డులు పొందిన ప్రముఖ నటి సురేఖా సిక్రి కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జయ ప్రకాష్ రెడ్డి మరణవార్త కూడా ఇంకా మరిచిపోకముందే మరో లెజెండరీ నటి పరిస్థితి విషమంగా ఉందంటూ వార్త వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి.. మూడు సార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న లెజెండరీ నటి సురేఖా సిక్రి సెప్టెంబర్ 8న అనారోగ్యం పాలైంది. ఈమె వయసు 75 సంవత్సరాలు. ఉన్నట్లుండి ఈమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆమెకు స్ట్రోక్ రావడం రెండేళ్ల కాలంలో ఇది రెండోసారి అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకపోయినా పరిస్థితి మాత్రం కాస్త విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈమె చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. అందులో కుటుంబ పెద్దగా ఆమె నటనకు అంతా నీరాజనాలు పట్టారు. సినిమాల్లో కూడా సురేఖ చాలా బిజీ. 2018లో ఈమె నటించిన 'బధాయి హో' సినిమా విడుదల సమయంలో ఈమెకు తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.

తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమె పాక్షిక పక్షవాతానికి గురైంది. దాని నుంచి క్షేమంగా బయట పడిన ఈమె సెప్టెంబర్ 8న జ్యూస్ తాగుతూ పడిపోయింది. దాంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఈమె నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ 'ఘోస్ట్ స్టోరీస్‌'లో జాన్వీ కపూర్‌తో కలిసి నటించింది సురేఖా సిక్రి. 'తమస్' (1988), 'మమ్మో' (1995), 'బధాయి హో' (2018) సినిమాలకు జాతీయ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ సంవత్సరం కరోనా తో బాటు చాలామంది సినీ ప్రముఖులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు తెలిపారు.


Tags :
|

Advertisement