Advertisement

  • ధోని శైలి , కోహ్లీ శైలి పూర్తి వ్యతిరేకం ..నాసిర్ హుస్సేన్

ధోని శైలి , కోహ్లీ శైలి పూర్తి వ్యతిరేకం ..నాసిర్ హుస్సేన్

By: Sankar Mon, 06 July 2020 4:33 PM

ధోని శైలి , కోహ్లీ శైలి పూర్తి వ్యతిరేకం ..నాసిర్ హుస్సేన్



ఇండియన్ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్ ల జాబితాలో అగ్రస్థానంలో ఉండే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ..కెప్టెన్ గా అన్ని కప్పులు సాధించి , ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ..అయితే ధోని తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న కోహ్లీ కూడా అద్భుతంగా కెప్టెన్సీ చేస్తున్నప్పటికీ కీలక మ్యాచ్ లలో టీమిండియా తడబడుతుంది ..అయితే ఈ ఇద్దరి కెప్టెన్సీ లపై ఇంగ్లాండ్ మాజీ కెప్టె నాసిర్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ..

ధోనీ తరువాత అలాంటి కెప్టెనే కావాలని అభిమానులు కోరుకుంటారని, అయితే కోహ్లీ అందుకు పూర్తి బిన్నంగా ఉంటాడని నాసిర్ పేర్కొన్నారు. ‘ధోనితో పోలిస్తే కోహ్లీ భిన్నమైన కెప్టెన్. అతడు ఎప్పటికీ ధోనీలా కూల్‌గా ఉండలేడు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేడు. కోహ్లీ ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉంటాడు. ఆ దూకుడుతోనే ప్రత్యర్థిపై పట్టు సాధించాలని అనుకుంటాడు. ఇదే అతడి విజయరహస్యం’ అంటూ కోహ్లీపై నాసిర్ ప్రశంసల వర్షం కురింపించాడు. అంతేకాకుండా కోహ్లీ మరొకరి మార్గాన్ని అనుసరించడని, తనకంటూ ప్రత్యేక పంథా ఏర్పరుచుకుని ముందుకెళతాడని నాసిర్ చెప్పుకొచ్చాడు.అందుకే కోహ్లీ ఎప్పటికీ ధోనీ కాలేడని అన్నారు. ధోనీ తరువాత కెప్టెన్సీ చేపట్టిన కోహ్లీపై చాలా బాధ్యతలు ఉంటాయని నాసిర్ పేర్కోన్నారు.

ఇదిలా ఉంటే కోహ్లీ 2015లో భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 2017లో వన్డే జట్టుకూ కెప్టెన్ అయ్యాడు. కోహ్లీ కెప్టెన్ అయ్యాక కూడా ధోనీ అడుగుజాడల్లో నడుస్తూ కెప్టెన్సీ సంబంధించి అనేక మెళకువలు నేర్చుకున్నాడు.ఇప్పటికి కూడా చాలా నిర్ణయాలలో ధోని సూచనలను కోహ్లీ తప్పక పాటిస్తున్నారు .

Tags :
|
|

Advertisement