Advertisement

  • స్పేస్ స్టేష‌న్‌ క‌క్ష్య‌ను మార్చిన నాసా శాస్త్ర‌వేత్త‌లు

స్పేస్ స్టేష‌న్‌ క‌క్ష్య‌ను మార్చిన నాసా శాస్త్ర‌వేత్త‌లు

By: chandrasekar Thu, 24 Sept 2020 6:30 PM

స్పేస్ స్టేష‌న్‌ క‌క్ష్య‌ను మార్చిన నాసా శాస్త్ర‌వేత్త‌లు


అంతరిక్షంలో శిధిలాలు ఢీకొనకుండా స్పేస్ స్టేష‌న్‌ క‌క్ష్య‌ను నాసా శాస్త్ర‌వేత్త‌లు మార్చారు. ఇందువల్ల అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రానికి ప్ర‌మాదం త‌ప్పింది. అంత‌రిక్ష శిథిలాలు ఢీకొన‌కుండా ఉండేందుకు నాసా శాస్త్ర‌వేత్త‌లు స్పేస్ స్టేష‌న్‌ను కొన్ని నిమిషాల పాటు క‌క్ష్య‌ను మార్చారు. రెండున్న‌ర నిమిషాల పాటు ఆ ప‌రేష‌న్ కొన‌సాగింది. భూ క‌క్ష్య నుంచి స్పేస్ స్టేష‌న్ ను స్వ‌ల్పంగా దూరంగా పంపేందుకు ర‌ష్యా, అమెరికా ఫ్ల‌యిట్ కంట్రోల‌ర్లు ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.

భూ ఉపరితలంలో అంత‌ర్జాతీయ అంత‌రిక్ష‌ కేంద్రానికి సుమారు 1.4 కిలోమీట‌ర్ల దూరం నుంచి అంత‌రిక్ష శిథిలాలు వెళ్లాయి. ఈ నేప‌థ్యంలో ఆ ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకునేందుకు నాసా ఈ విన్యాసం చేప‌ట్టింది. 2018లో ప్ర‌యోగించిన జ‌పాన్ రాకెట్‌కు సంబంధించిన శిథిలం స్పేస్ స్టేష‌న్ క‌క్ష్య‌లోకి వచ్చింద‌ని, దాన్ని త‌ప్పించేందుకు ఈ విన్యాసం చేప‌ట్టిన‌ట్లు నాసా చీఫ్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ తెలిపారు. జ‌పాన్ రాకెట్ సుమారు 77 ముక్క‌లైంది. ఆ ముక్క‌లే ఐఎస్ఎస్ క‌క్ష్య‌లోకి వ‌చ్చాయి. ముక్కలైన శిధిలాలు ఢీకొనకుండా ఈ విన్యాసం చేసినట్లు తెలిపారు.

కక్ష్యను మార్పు చేయడం వల్ల ఈ ప్రమాదం నుండి తప్పించవచ్చు. అంత‌రిక్ష కేంద్రం భూమికి 420 కిలోమీట‌ర్ల ఎత్తులో సుమారు గంట‌కు 17వేల మైళ్ళ వేగంతో ప్ర‌యాణిస్తుంది. ఆ వేగంలో చిన్న వ‌స్తువు త‌గిలినా అప్పుడు ఆ స్పేస్ స్టేష‌న్‌లోని సోలార్ ప్యాన‌ళ్ల‌కు భారీ ప్ర‌మాదం సంభ‌విస్తుంది. అయితే ఇలాంటి విన్యాసాలు స్పేస్ స్టేష‌న్‌కు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని 1999 నుంచి 2018 వ‌ర‌కు 25 సార్లు ఇలాంటి మాన్యువ‌ర్లు నిర్వ‌హించిన‌ట్లు నాసా చీఫ్ తెలిపారు.

Tags :
|
|

Advertisement