Advertisement

  • వ్యోమగాముల కోసం ఖరీదైన టాయిలెట్ తయారు చేసిన నాసా

వ్యోమగాముల కోసం ఖరీదైన టాయిలెట్ తయారు చేసిన నాసా

By: chandrasekar Sat, 03 Oct 2020 11:35 AM

వ్యోమగాముల కోసం ఖరీదైన టాయిలెట్ తయారు చేసిన నాసా


అంతరిక్ష ప్రయాణంలో వ్యోమగాముల కోసం ఖరీదైన టాయిలెట్ ను నాసా తయారు చేసింది. వ్యోమగాముల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రత్యేకంగా రూపొందించిన స్పేస్‌ టాయిలెట్‌ తాయారు చేసింది. టైటానియంతో దీనిని తయారు చేయడంతో దీని ధర రూ.168.63 కోట్లులని తెలిపారు. చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర కోసం అమెరికా ప్రయత్నిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా దీనిని తాయారు చేసారు.

ఇందులో భాగంగా చంద్రుడి మీదకు మనుషులను పంపడం కోసం త్వరలో అమెరికా చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం ఈ ప్రత్యేక మైన టాయిలెట్ ను తయారు చేశారు. ఈ టాయిలెట్‌ యొక్క బరువు 45 కిలోలు గాను ఎత్తు 28 అంగుళాలని తెలిపారు. వ్యోమగాములు ప్రయాణించే క్యాప్సూల్‌లో పరిస్థితులకు అనుగుణంగా, మహిళా వ్యోమగాములను దృష్టిలో పెట్టుకొని దీనిని తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. ఇంత విలువైన టాయిలెట్ తయారు చేయడం ఇప్పుడే మొదటి సారి కావచ్చేమో.

Tags :
|
|
|

Advertisement