Advertisement

సీఎం జగన్‌కు నరేంద్ర మోదీ ఫోన్...?

By: chandrasekar Thu, 15 Oct 2020 6:12 PM

సీఎం జగన్‌కు నరేంద్ర మోదీ ఫోన్...?


గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాల ధాటికి ఇప్పటికే 10 మంది మరణించారు. ఈ తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. భారీగా వర్షాలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం ట్వీట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. తెలంగాణ, ఏపీలో భారీగా కురుస్తున్న వర్ష ప్రభావం గురించి అడిగి తెలుసుకున్నాను. రెండు రాష్ట్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా అందిస్తానని ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చాను. వర్షాల వల్ల నష్టపోయిన వారి చుట్టూనే నా ఆలోచనలు తిరుగుతున్నాయి. అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఇక, ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో 10 మంది మరణించారని సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కలెక్టర్లు, సంబంధిత అధికారులు, పోలీసులు అనుక్షణం అప్రమ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల వల్ల మృతి చెందిన 10 మంది కుటుంబ సభ్యులకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌కు ఆదేశాలు జారాయి చేసారు.

Tags :
|
|
|

Advertisement