Advertisement

  • నివాసంలో ఉన్న జర్నలిస్టును పోలీసులు కిడ్నాప్ చేశారని నారా లోకేష్ ఆరోపణ

నివాసంలో ఉన్న జర్నలిస్టును పోలీసులు కిడ్నాప్ చేశారని నారా లోకేష్ ఆరోపణ

By: chandrasekar Sat, 29 Aug 2020 09:33 AM

నివాసంలో ఉన్న జర్నలిస్టును పోలీసులు కిడ్నాప్ చేశారని నారా లోకేష్ ఆరోపణ


హైదరాబాద్‌లో తన నివాసంలో ఉన్న జర్నలిస్టును ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు కిడ్నాప్ చేశారని నారా లోకేష్ ఆరోపణ చేశారు. హైదరాబాద్‌లో జర్నలిస్టు శివప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న శివప్రసాద్‌ను అతని భార్య ఎదుటే పోలీసులు కిడ్నాప్ చేశారని లోకేష్ ఆరోపించారు.

ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైదరాబాద్‌లో జర్నలిస్టు శివప్రసాద్‌ను అతని ఇంట్లోనే కిడ్నాప్ చేశారు. ఆయన ఏం చేశారు ఆయన ఏపీ ప్రభుత్వ పాలసీల మీద ప్రశ్నించారు. ఎలాంటి వారెంట్, నోటీసు ఇవ్వకుండా ఫోన్‌ను కూడా జప్తు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియోను జర్నలిస్టు శివప్రసాద్ కుటుంబసభ్యులు రికార్డు చేశారు. ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. కుటుంబసభ్యుల ముందే కిడ్నాప్ చేశారు అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో వైఎస్ జగన్ ఏపీ పోలీసులను తన పార్టీ కార్యకర్తల్లా వాడుకోవడం చూసి బాధేస్తోంది. ఇది సీరియస్‌గా మానవహక్కుల ఉల్లంఘన పోలీసులు పెద్ద తప్పు చేశారు. అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. నారా లోకేష్ పోస్ట్ చేసిన ఆడియో అంత స్పష్టంగా లేదు. అరెస్టు చేయబడ్డ జర్నలిస్టు అసలు పత్రికలో పనిచేస్తున్నారా, లేకపోతే టీవీకి చెందిన వారా, సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే వారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతకీ ఆ జర్నలిస్టు ఏ సంస్థలో పనిచేస్తున్నారనే వివరాలను కూడా నారా లోకేష్ తెలియజేయలేదు.

Tags :

Advertisement