Advertisement

  • ఏకంగా జిల్లా ఎస్పీ ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

ఏకంగా జిల్లా ఎస్పీ ఫేస్‌బుక్‌ అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

By: Sankar Fri, 18 Sept 2020 9:09 PM

ఏకంగా జిల్లా ఎస్పీ ఫేస్‌బుక్‌  అకౌంట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు


సైబర్‌ నేరగాళ్లు నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కే గురిపెట్టారు. ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి ఆయన పేరుతో మిత్రులను డబ్బు డిమాండ్‌ చేశారు. ఈ విషయం తెలిసిన మిత్రులు వెంటనే రంగనాథ్‌ను అప్రమత్తం చేశారు. అలర్ట్‌ అయిన ఎస్పీ వెంటనే సైబర్‌ టీంను రంగంలోకి దింపారు. దీనిపై తగిన విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.

సైబర్‌ టీం పోలీసులు దీన్ని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్‌ పేరుతో రెండు ఫేస్‌బుక్‌ అకౌంట్లు ఉన్నాయి. ఇందులో ఆవుల వెంకటరంగనాథ్‌ పేరుతో పాత అకౌంట్‌ ఉన్నది. ప్రస్తుతం రంగనాథ్‌ ఆవుల వెంకట పేరుతో మరో అకౌంట్‌ నడుస్తోంది. కానీ పాత అకౌంట్‌ పేరు ఈ రోజు మధ్యాహ్నం హ్యాక్‌ జరిగినట్లు గుర్తించారు. దుండగులు ఆయన మిత్రులకు మెస్సెంజర్‌ ద్వారా డబ్బులు అడిగారు.

ఈ విషయాన్ని సదరు మిత్రులు వెంటనే ఎస్పీ రంగనాథ్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ వెంటనే సైబర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి విచారణకు ఆదేశించారు. పాత అకౌంట్‌ను పరిశీలించి హ్యాక్‌ అయినట్లుగా గుర్తించిన సిబ్బంది..ఒడిశా రాష్ట్రం నుంచి హ్యాకర్లు మెసేజ్‌ పంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాల సేకరణ కోసం సైబర్‌ టీం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే హ్యాక్‌ అయిన అకౌంట్‌ను డియాక్టీవేట్‌ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

Tags :
|

Advertisement