Advertisement

  • కన్నతల్లి ముందే కరోనా కారణంగా చనిపోయిన యువకుడి ఘటనపై స్పందించిన నల్గొండ కలెక్టర్ ..

కన్నతల్లి ముందే కరోనా కారణంగా చనిపోయిన యువకుడి ఘటనపై స్పందించిన నల్గొండ కలెక్టర్ ..

By: Sankar Sun, 19 July 2020 9:26 PM

కన్నతల్లి ముందే కరోనా కారణంగా చనిపోయిన యువకుడి ఘటనపై స్పందించిన నల్గొండ కలెక్టర్ ..



కరోనా కారణంగా హృదయ విదారక సంఘటనలు జరుగుతున్నాయి .,ఇటీవల హైదరాబాద్ లో కొంత మంది ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనలు మరిచిపోకముందే నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో శనివారం కరోనా వైరస్‌ లక్షణాలతో మిర్యాలగూడ మండలం సల్కునూరుకు చెందిన ఓ యువకుడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు.

ఈ ఘటనపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పందించారు. ఐసీయూ కొవిడ్ వార్డులో 15 పడకలు, వెంటిలేటర్స్, సెంట్రల్ ఆక్సిజన్ సిలిండర్లతో 30 పడకలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 252 మంది పాజిటివ్ కేసులకు ఐసొలేషన్ వార్డులో వైద్యం అందించి డిశ్చార్జి చేశారని చెప్పారు. వైద్య సిబ్బంది రోగులకు మనో ధైర్యం కల్పించాలని కలెక్టర్ సూచించారు.

శనివారం ఉదయం కరోనా వైరస్‌ లక్షణాలతో మిర్యాలగూడ మండలం సల్కునూరుకు చెందిన ఓ యువకుడు, తల్లి సాయంతో ఆస్పత్రికి వచ్డాడు. వైద్యులు, నమూనాలను తీసుకొని కరోనా వార్డులో చేర్చారు. అప్పటి నుంచి వైద్యులు గానీ నర్సులు గానీ అతడి వైపే రాలేదు. కొద్దిసేపటి తర్వాత నుంచి ఊపిరి ఆడక విలవిల్లాడిన అతడు సాయంత్రానికి తన తల్లి కళ్లెదుటే కన్నుమూశాడు. కొడుకు మృతదేహం మీద పడి ఆ తల్లి గుండెలవిసేలా ఏడ్చింది. తల్లి రోదన పలువురిని కంటతడి పెట్టింది.


Tags :
|

Advertisement