Advertisement

  • హోరాహోరీగా సాగిన ఏటీపీ ఫైనల్స్‌లో నాదల్‌ ఓటమి...

హోరాహోరీగా సాగిన ఏటీపీ ఫైనల్స్‌లో నాదల్‌ ఓటమి...

By: chandrasekar Wed, 18 Nov 2020 1:11 PM

హోరాహోరీగా సాగిన ఏటీపీ ఫైనల్స్‌లో నాదల్‌ ఓటమి...


ఏటీపీ టోర్నీఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ రఫెల్‌ నాదల్‌కు ఓటమి ఎదురైంది.

గ్రూప్‌దశ తన రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌ స్టార్‌ నాదల్‌ 6-7(7/9), 6-7(4/7) తేడాతో మూడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌(ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు.

ఇరు సెట్లు హోరాహోరీగా జరిగినా.. టై బ్రేకర్లలో సత్తాచాటిన థీమ్‌ విజేతగా నిలిచాడు. కాగా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచిన డొమినిక్‌ సెమీస్‌కు చేరువయ్యాడు.

టోర్నీలో తదుపరి మ్యాచ్‌ లో స్టిఫనోస్‌ సిట్సిపాస్‌తో నాదల్‌ తలపడనున్నాడు. కాగా మరో గ్రూప్‌ దశ మ్యాచ్‌లో డానిల్‌ మద్వెదెవ్‌(రష్యా) 6-3, 6-4 తేడాతో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ)పై విజయం సాధించాడు.

Tags :
|
|
|
|
|

Advertisement