Advertisement

  • నా కుటుంబం 83 ..మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానా అని అతృతగా ఉంది: కపిల్‌దేవ్‌

నా కుటుంబం 83 ..మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానా అని అతృతగా ఉంది: కపిల్‌దేవ్‌

By: chandrasekar Fri, 30 Oct 2020 4:36 PM

నా కుటుంబం 83 ..మిమ్మల్ని ఎప్పుడు కలుస్తానా అని అతృతగా ఉంది: కపిల్‌దేవ్‌


భారత క్రికెట్‌ దిగ్గజం, హర్యానా హరికేన్ కపిల్‌దేవ్‌ క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులకు ఓ సందేశాన్ని పంపారు. తాను వేగంగా కోలుకుంటున్నట్లు ప్రకటించారు. అందరి ఆశీర్వాదాల వల్ల తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. " ‘నా కుటుంబం 83 మీ అందర్నీ ఎప్పుడు కలుస్తానా అని అతృతగా ఉంది. మీ అందరినీ త్వరగా కలవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్న నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ ఏడాది ముంగిపు దశకు వచ్చింది. వచ్చే ఏడాది ఆశించిన స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నా’ అని కపిల్‌ అన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. డాక్టర్లు ఆంజియో ప్లాస్టీ చికిత్స చేశారు. కపిల్ దేవ్‌కు డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చిందగానే క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న తర్వాత కపిల్ దేవ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కపిల్ ఆరోగ్యం కాస్త కొలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

లెంజెండ్ కపిల్ దేవ్ టీమిండియాకు తొలి క్రికెట్ ప్రపంచ కప్ అందించారు. 16 ఏళ్ల పాటు టీమిండియాకు సేవలు అందించిన కపిల్ దేవ్.. 131 టెస్ట్‌లు, 225 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ప్రపంచంలో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒక్కరు. టెస్ట్‌ల్లో 5248 పరుగులతో పాటు 434 వికెట్లు తీశారు. ఇక వన్డేల్లో 3783 రన్స్‌తో పాటు 253 వికెట్లు సాధించారు. 1983 వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగులు వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో మైలురాయిగా నిలిచిపోయింది. మన దేశానికి తొలి వరల్డ్ కప్ అందించిన లెంజెండ్ కపిల్ దేవ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేశారు.

Tags :

Advertisement