Advertisement

  • తెలంగాణ చేనేత కళాకారులు డిజైన్‌ పై మనసు పారేసుకున్న నటి ముస్కాన్‌సేథీ

తెలంగాణ చేనేత కళాకారులు డిజైన్‌ పై మనసు పారేసుకున్న నటి ముస్కాన్‌సేథీ

By: chandrasekar Sat, 19 Sept 2020 07:41 AM

తెలంగాణ చేనేత కళాకారులు డిజైన్‌ పై మనసు పారేసుకున్న నటి ముస్కాన్‌సేథీ


తెలంగాణ చేనేత కళాకారులు డిజైన్‌ పై మనసు పారేసుకున్న నటి ముస్కాన్‌సేథీ. ‘రాధాకృష’్ణ సినిమాతో తెలంగాణ చేనేత కళ ఔన్నత్యాన్ని, కార్మికుల జీవనశైలిని తెలుసుకునే అవకాశం దొరికిందని కథానాయకి ముస్కాన్‌సేథీ అంటోంది. ఆమె కథానాయికగా నటిస్తోన్న చిత్రం ‘రాధాకృష్ణ’.శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా ముస్కాన్‌సేథీ కనిపించబోతున్నది.

ఇక్కడ కళా నైపుణ్యం పై మాట్లాడుతూ ఈ సినిమా విశేషాలతో పాటు తన పాత్రను గురించి ముస్కాన్‌సేథీ వెల్లడిస్తూ ‘ఘనమైన చారిత్రక నేపథ్యమున్న నిర్మల్‌ కొయ్య బొమ్మల కథాంశంతో తెరకెక్కతున్న చిత్రమిది. విదేశీ వస్తువుల్ని నిషేధిస్తూ స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించవలసిన ఆవశ్యకతను చాటిచెబుతుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది.

తను నటిస్తున్న ఈ సినిమాలో తెలంగాణ చేనేత కళాకారులు డిజైన్‌ చేసిన చీరలు, లంగా ఓణీలను ధరించాను. నా క్యాస్టూమ్స్‌ అన్నింటిని చేనేత కార్మికుల ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఈ సినిమాతో చేనేత కళపై ప్రేమ పెరిగింది. చీరను కట్టడంలో ఎక్స్‌పర్ట్‌ అయ్యాను’ అని తెలిపారు. ఈ సినిమా ద్వారా చేనేత కళాకారులు తయారు చేసిన చీరలు మంచి గుర్తింపును పొందుతాయని చెప్పింది.

Tags :

Advertisement