Advertisement

  • ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించిన పాక్ న్యాయస్థానం

ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించిన పాక్ న్యాయస్థానం

By: Sankar Thu, 19 Nov 2020 10:52 PM

ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించిన పాక్ న్యాయస్థానం


ముంబై పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ కు శిక్ష విధించింది పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం.. రెండు కేసుల్లో జమాత్‌ ఉల్‌ దవా సంస్థ చీఫ్‌ హఫీజ్ సయీద్‌కు.. పదేళ్ల జైలు శిక్ష విధించింది పాకిస్థాన్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం.

ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న కేసులో ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్ష పడగా.. అతడు ప్రస్తుతం లాహోర్‌లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా, హఫీజ్‌తో పాటు మరో నలుగురికి పాకిస్తాన్‌ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఉగ్ర సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న ఆరోపణలపై అతడితో పాటు జేయూడీ సభ్యులపై పాక్‌ ఉగ్ర నిరోధక విభాగం దాదాపు 41 కేసులు పెట్టగా.. వాటిల్లో రెండు కేసుల్లో తాజాగా శిక్ష పడింది.

ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ముందుండి అన్నీ చూసుకొనే జేయూడీకి చీఫ్‌గా ఉన్న హఫీజ్‌.. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉన్నాడు. అంతేకాకుండా అమెరికా అతడిపై 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ కూడా ప్రకటించింది.

Tags :
|

Advertisement