Advertisement

  • ముంబై పోలీసులు తమను అడ్డుకోవడం...సుశాంత్‌ కేసులో మిస్టరీ... బీహార్‌ డీజీపీ

ముంబై పోలీసులు తమను అడ్డుకోవడం...సుశాంత్‌ కేసులో మిస్టరీ... బీహార్‌ డీజీపీ

By: chandrasekar Wed, 05 Aug 2020 9:16 PM

ముంబై పోలీసులు తమను అడ్డుకోవడం...సుశాంత్‌ కేసులో మిస్టరీ... బీహార్‌ డీజీపీ


బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్ పాండే సుశాంత్‌ కేసులో ఏదో తప్పు జరుగుతున్నదని బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపించారు. ముంబై పోలీసులు తమను అన్ని విధాలా అడ్డుకోవడం, ఎవరినీ సంప్రదించనీయకపోవడంతో ఈ అనుమానాలు తలెత్తుతున్నాయని మంగళవారం ఆయన అన్నారు.

కేసు దర్యాప్తునకు ముంబై వెళ్లిన తమ ఐపీఎస్‌ అధికారి విన‌య్‌ తివారీని బలవంతంగా క్వారంటైన్‌లో ఉంచారని పాండే విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమ పోలీసుల పట్ల గర్వంగా ఉన్నట్లయితే సుశాంత్‌ చనిపోయిన తర్వాత ఈ 50 రోజుల్లో వారు ఏమి సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరోవైపు బీహార్‌ పోలీస్‌ అధికారి వినయ్‌ తివారీని ముంబైలో క్వారంటైన్‌లో ఉంచడాన్ని సీఎం నితీశ్‌ కుమార్‌ తప్పుపట్టారు. అయితే బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ అధికారులు తమ చర్యను సమర్థించుకున్నారు. కరోనా నియంత్రణ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యహరించినట్లు పేర్కొన్నారు.

మహారాష్ట్ర పరిధికి సంబంధించిన కేసులో దర్యాప్తు చేసే అధికారం బీహార్‌ పోలీసులకు లేదని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌ మరణం కేసు వ్యవహారం మహారాష్ట్ర, బీహార్‌ పోలీసులు, ఆ రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీల మధ్య వివాదంగా మారింది.

Tags :

Advertisement