Advertisement

  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్

By: Sankar Mon, 12 Oct 2020 11:10 AM

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్


ఐపీఎల్ 2020 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్ ఆధిపత్యం మొదలైంది. సీజన్‌ని పేలవంగా ఆరంభించి.. ఘనంగా ముగించడం ముంబయి ఇండియన్స్ స్టయిల్. తాజా సీజన్‌లోనూ తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పేలవంగా ఓడిపోయిన ముంబయి.. ఆ తర్వాత జోరందుకుని వరుస విజయాలతో దూసుకెళ్తోంది.

ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ముంబయి టీమ్ ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో నెం.1 స్థానానికి ఎగబాకింది. ఇక లీగ్ దశలో మిగిలిన ఏడింట్లో కనీసం మూడింట్లో గెలుపొందినా.. ఆ జట్టు ప్లేఆఫ్‌కి అర్హత సాధించినట్లే..!

ముంబయి ఇండియన్స్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు విజయాలతో రెండో స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగేసి విజయాలతో టాప్-4లో చోటు దక్కించుకున్నాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అయిదవ స్థానంలో నిలిచింది..నిన్న రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓడిపోవడంతో అయిదవ స్థానంలోనే ఉంది

Tags :
|
|

Advertisement