Advertisement

  • ఐపీఎల్‌ 2020 ఫైనల్లో ఢిల్లీ పై గెలుపుతో ఐదోసారి ట్రోఫీ ని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్‌ 2020 ఫైనల్లో ఢిల్లీ పై గెలుపుతో ఐదోసారి ట్రోఫీ ని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్

By: chandrasekar Wed, 11 Nov 2020 09:24 AM

ఐపీఎల్‌ 2020 ఫైనల్లో ఢిల్లీ పై గెలుపుతో ఐదోసారి ట్రోఫీ ని సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్


దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2020 ఫైనల్లో ఢిల్లీ పై గెలుపుతో ఐదోసారి ట్రోఫీ ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నది. ఐపీఎల్‌ 2020 డిఫెండింగ్‌ ఛాంపియన్‌‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2013, 2015, 2017, 2019 తర్వాత ముంబై ఇండియన్స్ ఖాతాలో మొత్తంగా ఇది ఐదో టైటిల్ ను కైవసం చేసుకుంది. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2020 ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈసారి అయినా తొలి ఐపిఎల్ ట్రోఫీ కైవసం చేసుకోవాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ కల కలగానే మిగిలిపోయింది. అంచనాలకు అనుగుణంగానే డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరోసారి విజయం సృష్టించింది.

ఐపీఎల్‌ సీజన్లో వరుసగా రెండో టైటిల్‌తో తన రికార్డును తానే తిరగరాసుకుంది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) అర్ధ శతకంతో దుమ్మురేపడంతో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 156/7 స్కోరు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్‌), రిషభ్‌ పంత్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్‌ సెంచరీలు చేశారు. బౌల్ట్‌ (3/30) మూడు వికెట్లతో ఢిల్లీ వెన్నువిరవగా కల్టర్‌నైల్‌ (2/29), జయంత్‌ యాదవ్‌ (1/25) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. ఇషాన్‌ కిషన్‌ (19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్‌) మరోసారి ఆకట్టుకున్నాడు. నోకియా (2/25) రెండు వికెట్లు పడగొట్టగా స్టొయినిస్‌ (1/23), రబాడ (1/32)కు చెరో వికెట్‌ దక్కాయి. బౌల్ట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. రోహిత్ శర్మ బాటింగ్ లో అదరగొట్టి ముంబై కి విజయాన్ని అందించాడు.

Tags :

Advertisement